బెల్ట్ షాపులు నడిపితే బెల్టు తీస్తా...అంటున్న మొనగాడు

Published : Oct 06, 2017, 06:36 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బెల్ట్ షాపులు నడిపితే బెల్టు తీస్తా...అంటున్న మొనగాడు

సారాంశం

పేదోళ్ళు కట్టుకున్న ఎన్టీఆర్ ఇళ్లను చేస్తే ఆనందంగా ఉంది  సంవత్స కాలంలో నాగార్జున సాగర్ కాలువల్లో గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తా  గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపితే బెల్టు తీస్తా...

ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర నోట ఆణిముత్యాలు వెలువడ్డయి.

అవి :

  • పేదోళ్ళు కట్టుకున్న ఎన్టీఆర్ ఇళ్లను చేస్తే ఆనందంగా ఉంది 
  • సంవత్స కాలంలో నాగార్జున సాగర్ కాలువల్లో గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తా 
  • గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపితే బెల్టు తీస్తా...

 

రెడ్డిగూడెం : మీ పొలాలు బంగారం కాబోతున్నాయి, ఒక్క సెంటు కూడా అమ్ముకోవద్దని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు చెప్పారు.  శుక్రవారం సాయంత్రం రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం, మంగపురం గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి ఉమా పాల్గొని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాలు వివరించారు.గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపితే బెల్టు తీస్తానని హెచ్చరించారు.  ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. "పేదోళ్ళు కట్టుకున్న ఎన్టీఆర్ ఇళ్లను చేస్తే ఆనందంగా ఉంది" అని ఆయన మురిసిపోయారు. ఒక్క   సంవత్స ర కాలం ఆగండి,  నాగార్జున సాగర్ కాలువల్లో గోదావరి జలాలను పరుగులు పెట్టిస్తా నని అన్నారు.
 ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మాణానికి 15 వేలు ఇస్తే  20వేల తో చక్కగా నిర్మించుకున్నారని  అభినందించారు. ఇంకా మిగిలిపోన రేషన్ కార్డులు, పింఛన్లు, ఎన్టీఆర్ ఇల్లు వచ్చే జన్మభూమిలో అందజేస్తామని మంత్రి ఉమా తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి ఉమాకు రుద్రవరం గ్రామ ప్రజలు జనస్వాగతం పలికి అడుగడునా హారతులిచ్చారు.  మీరు వేసిన ఓటుకు ఎన్ని పనులు చేసినా, ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేనిదని మంత్రి ఉమా ప్రజల హర్షద్వానాల మధ్య తెలియజేసారు.

 

మరిన్ని వార్తలు ఇక్కడ చూడండి

http://telugu.asianetnews.com/news/asianet-telugu-express-news-national-andhra-pradesh-and-telangana

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu