ఢిల్లీ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు

By ramya neerukondaFirst Published Nov 30, 2018, 3:21 PM IST
Highlights

ఢిల్లీ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది.

ఢిల్లీ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది.  అక్రమ ఆర్థిక లావాదేవుల కేసులో ఇటీవల సుజనా చౌదరికి ఈడీ( ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సుజనాకి ఎదురుదెబ్బ తగలింది.

ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ సమన్లు జారీ చేయడంతో, ఈడీ సమక్షంలో సోమవారం హాజరుకావాలని హైకోర్టు సుజనా చౌదరిని ఆదేశించింది. అయితే ఆయనపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీని ఆదేశించింది.
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని సుజన హైకోర్టుకు తెలిపారు. రాజకీయంగా కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కాగా..సుజనా చౌదరి రూ.5,700 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

read more news

సుజనాకు ఈడీ సమన్లు: చంద్రబాబుకు పెద్ద దెబ్బ

రూ.6వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్: సుజనాచౌదరికి ఈడీ సమన్లు

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఐటీ అధికారుల షాక్..

click me!