జగన్ ఆ విషయంలో గ్రేట్: ఆర్ నారాయణ మూర్తి

Published : Nov 30, 2018, 02:54 PM IST
జగన్ ఆ విషయంలో గ్రేట్: ఆర్ నారాయణ మూర్తి

సారాంశం

సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి వైసీపీ అధినేత జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 

అనంతపురం: సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి వైసీపీ అధినేత జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 

విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలో జరిగిన సమరయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి ప్యాకేజీకి ఓకే చెప్పిన చంద్రబాబునాయుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకోవడం సరికాదన్నారు.

ప్రత్యేక హోదా పోరు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తొలి ఓటు తానే వేస్తానని, అలాకాకపోతే భూస్థాపితం చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?