అలా చేస్తే.. ప్రజలు పవన్ ని క్షమించరు..వైసీపీ

Published : Nov 30, 2018, 03:03 PM IST
అలా చేస్తే.. ప్రజలు పవన్ ని క్షమించరు..వైసీపీ

సారాంశం

ఏదో ఒక రూపంలో పవన్ చంద్రబాబుకి మద్దతు ఇస్తూనే ఉన్నారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడతూ వస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు.  పవన్ ఇప్పటికీ చంద్రబాబుకి మద్దతుగా వ్యవహరిస్తే.. ఆయనను ఇక ప్రజలు క్షమించరని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం కాకినాడలో వైసీపీ నేతల సమక్షంలో వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఏదో ఒక రూపంలో పవన్ చంద్రబాబుకి మద్దతు ఇస్తూనే ఉన్నారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడతూ వస్తున్నారని మండిపడ్డారు.

ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. హోదా కోసం జగన్ మాత్రమే పోరాటం చేశారన్నారు.  జగన్ ని ఇబ్బంది పెట్టడం కోసమే.. చంద్రబాబు 28 సార్లు ఢిల్లీ వెళ్లారని మరోనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలోని హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మోదీ మాటమార్చారని మండిపడ్డారు.  చంద్రబాబు లాంటి నయవంచకుడు ప్రజాసామ్యంలో ఉండటానికి వీలులేదని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu