జగన్ తో పొత్తా, నెవర్: పవన్ కల్యాణ్ స్పష్టీకరణ

By Nagaraju TFirst Published 21, Nov 2018, 5:48 PM IST
Highlights

 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందంటున్నవ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాను మెుదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నానని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. 
 

చెన్నై: 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందంటున్నవ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాను మెుదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నానని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. 

తనకు కావాల్సింది రాష్ట్రప్రయోజనాలేనని తెలిపారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించడం లేదన్నారు. కేవలం తనపై కేసులు ఉన్నాయన్న భయంతోనే జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదన్నారు. 

2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా వెళ్తుందన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందన్నారు. ఆయనకు నమ్మకం లేకనే పంచాయితీ సభ్యుడిగా కూడా పోటీ చెయ్యని లోకేష్ ను మంత్రి చేశారని విమర్శించారు. 

వార్డు సభ్యుడిగా కూడా పోటీ చెయ్యని లోకేష్ ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చేశారంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది జనసేన మాత్రమేనని పవన్ చెప్పుకొచ్చారు. అటు వైసీపీతో జనసేన నాయకులు రహస్యంగా చర్చిస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. 

తాను ఏదైనా నేరుగా రాజకీయాలు చేస్తానని తెరవెనుక రాజకీయాలు చెయ్యబోనని తెలిపారు. తాను వైసీపీతో పొత్తుపెట్టుకుంటే రహస్యంగా చర్చలు ఎందుకు జరుపుతానని నేరుగానే జరుపుతానన్నారు. వైసీపీతో పొత్తు అనేది టీడీపీ నేతల ఊహాగానాలు అంటూ పవన్ చెప్పారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

బాబుతో ప్రయాణం ప్రమాదకరం:రాహుల్ కి పవన్ హెచ్చరిక

తమిళంలో స్పీచ్ అదరగొట్టిన పవన్

Last Updated 21, Nov 2018, 6:06 PM IST