చంద్రబాబు కుటుంబం ఆస్తులివే: దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 18.72 కోట్లు

By narsimha lodeFirst Published Nov 21, 2018, 5:30 PM IST
Highlights

వరుసగా ఎనిమిదోసారి చంద్రబాబునాయుడు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది.


అమరావతి: వరుసగా ఎనిమిదోసారి చంద్రబాబునాయుడు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది. ఏపీ రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతిలో బుధవారం నాడు తమ ఆస్తులను ప్రకటించారు.రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే  ఆస్తులను ప్రకటించినట్టు చెప్పారు.

బ్రహ్మణి నికర ఆస్తి విలువ రూ. 7.72 కోట్లు, దేవాన్ష్ పేరు మీద రూ.  18.72 కోట్లు,తన ఆస్తి(నారా లోకేష్) ఆస్తి రూ. 21.40 కోట్లు . ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆస్తుల విలువ రూ. 29.9 కోట్లుగా ఉందని లోకేష్ ప్రకటించారు.భువనేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ.3101.45 కోట్లు విలువ ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం హెరిటేజ్ నికర లాభం రూ. 6,038కోట్లు ఉందని ఆయన  చెప్పారు. చంద్రబాబుపై  రూ.5.31 కోట్ల అప్పులు ఉన్నాయని లోకేష్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో నివాసం విలువ రూ.8 కోట్లు కాగా, నారావారి పల్లెలో రూ.23.83 లక్షల విలువైన నివాసం ఉందని చెప్పారు.నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అన్నారు. హెరిటేజ్‌ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా ప్రకటించారు. .

 సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్‌ను స్థాపించినట్టు తెలిపారు. తన తల్లి భువనేశ్వరి ఎంతో సమర్థంగా ఆ సంస్థను నడిపిస్తున్నారన్నారు. రోజుకు 15లక్షల లీటర్ల పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. 

ప్రతి పూట 3లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తున్నామన్నారు. హెరిటేజ్‌ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.తనకు  హెరిటేజ్ నుండి జీతాలు వస్తాయని కమీషన్  వస్తోందన్నారు. తమ కుటుంబానికి అవినీతికి, దొంగ పనులు చేయాల్సిన అవసరం లేదని  లోకేష్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

పవన్ రుజువులు చూపితే మాట్లాడుతా: లోకేష్

అది కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే: నారా లోకేస్ వ్యంగ్యం

చంద్రబాబు కుటుంబం ఆస్తులివే: దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 18.72 కోట్లు

 

click me!
Last Updated Nov 21, 2018, 6:29 PM IST
click me!