
అనేక పరిణామాల అనంతరతం బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ని రాజీనామా చేయించాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో నితీశ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామాను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆమోదించి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. దానికి సరేనన్న నితీశ్ అకస్మాత్తుగా భాజపాతో సమావేశమయ్యారు. ఆ తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ ని ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎంచుకున్నారు. ఈరోజు ఉదయం భాజపా మద్దతుతో నితీశ్ ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.