వైసీపీలోకి టిఎస్ఆర్...వైజాగ్ పార్లమెంటుకు పోటి

Published : Jul 27, 2017, 07:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
వైసీపీలోకి టిఎస్ఆర్...వైజాగ్ పార్లమెంటుకు పోటి

సారాంశం

కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా వైసీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభకు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.  

ఎన్నికల వేడి పెరిగేకొద్దీ సమీకరణలు కూడా మారిపోతున్నాయ్. వివిధ పార్టీల్లోని నేతలు తమకు అనువుగా ఉండే పార్టీలను, సేఫ్ నియోజకవర్గాలను ఇప్పటి నుండే వెతుక్కుంటున్నారు. వైసీపీ నుండి చంద్రబాబునాయుడు ఇప్పటికే 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్న విషయం తెలిసిందే. ఇంకా ఎవరైనా వస్తారా అని కాగడా పెట్టుకుని వెతుకుతున్నారు. అదే సమయంలో పలువురు టిడిపి ప్రజా ప్రతినిధులూ వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ ఎవ్వరూ చేరలేదు.

ఇంతలో కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు వైసీపీలోకి చేరటానికి రంగం సిద్ధమవుతోంది. విజయవాడకు చెందిన మాజీ ఎంఎల్ఏ మల్లాదివిష్ణు వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందేకదా? అదే దారిలో కేంద్రమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా వైసీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభకు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో నిజానికి వైసీపీకి ఇద్దరు ముగ్గురు తప్ప పెద్ద స్ట్రాంగ్ లీడర్లూ లేరు. అందులోనూ విశాక లోక్ సభకు సరైన నేత లేరు. అందుకనే టిఎస్ఆర్ గనుక వైసీపీలోకి వస్తే పార్టీకి పెద్ద ఊపు వస్తుందని భావిస్తున్నారు.

టిఎస్సాఆర్ తో పాటు ఇంకా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీవైపు చూస్తున్నారని సమాచారం. వారంతా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి చేరకపోయినా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చేరికలు ఖాయమనిపిస్తోంది.

కాంగ్రెస్ లో నుండి వైసీపీకి వెళ్లాలనుకుంటున్న వారిలో సుమారు 15 మంది ప్రముఖులు ఇప్పటికే జగన్ తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు పార్లమెంటుకు మిగిలిన వారు అసెంబ్లీకి పోటీ చేయటానికి మొగ్గుచూపుతున్నారు.  వారందరికీ జగన్ కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. బహుశా నంద్యాల ఉపఎన్నికల తర్వాత ఏ పార్టీలో ఎన్ని చేరికలుంటాయో  చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్