పొలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు.. రైతు ఆత్మహత్యాయత్నం

By Mahesh KFirst Published Dec 22, 2021, 5:12 AM IST
Highlights

ప్రభుత్వం తన దగ్గర తీసుకున్న ఎకరా పొలానికి పరిహారం ఇవ్వలేదని, తనకు ఇస్తాన్న భూమినీ ఇవ్వలేదని నెల్లూరుకు చెందిన ఓ రైతు మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా.. స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. కానీ, ఆ పెనుగులాటలో ఆయనకు గుండెనొప్పి వచ్చినట్టు చెప్పారు. వెంటనే 108 వాహనంలో హాస్పిటల్ తీసుకెళ్లారు.
 

అమరావతి: పేదల ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం(andhra pradesh govt) అడగ్గానే తన పొలం ఇచ్చారని, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరనే అడిగానని, అందుకే అధికారులు అంగీకరించారని, కానీ, ఇప్పుడు మొండి చేయి చూపుతున్నారని ఓ రైతు(Farmer) ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం పొలం(Land) ఇస్తే.. తనకు పరిహారం(Compensation) ఇవ్వలేదని, లేదా మరో చోట భూమినైనా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయాన్ని అధికారుల దగ్గర ప్రస్తావిస్తే సమాధానం రావడం లేదని బాధపడుతూ పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆయన గుండెపోటుతో నేలకూలాడు. వెంటనే ఆయనను హాస్పిటల్ తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంగం మండలం సిద్దీపురం గ్రామానికి చెందిన సూరా శ్రీనివాసులు రెడ్డి కొన్నేళ్ల క్రితం ఓ రైతు దగ్గర ఐదు ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. కాగా, గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాలను సేకరిస్తుండగా అందులో శ్రీనివాసులు రెడ్డి కొనుగోలు చేసిన భూమిలో 0.29 సెంట్ల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే సందర్భంలో పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎకరా పొలం కావాల్సి వచ్చింది. దీంతో ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి పొలంలో ఒక ఎకరా ఇవ్వాలని అధికారులు కోరారు.

Also Read: లబ్దిదారులకు సర్వహక్కులు: తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించిన జగన్

మార్కెట్ రేటు ప్రకారం, అప్పుడు ఎకరా రేటు రూ. 30 లక్షలు ఉంది. అయితే, అధికారులు గుర్తించిన 0.29 సెంట్ల ప్రభుత్వ భూమి తన అధీనంలో ఉన్నది కనుకా.. ఆ భూమిని ప్రభుత్వ ధర ప్రకారం, తనకు ఇస్తే.. రూ. 30 లక్షల విలువైన ఎకరా పొలం రూ. 15 లక్షలకే ఇస్తానని రైతు చెప్పారు. ఈ మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో అధికారులు అంగీకరించారని, మంత్రి కూడా వైసీపీ నేత, రైతు సూరా శ్రీనివాసులు రెడ్డిక మాట ఇచ్చినట్టు బాధితుడు చెప్పారు.

తాజాగా, సూరా శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ జన్మదిన సంబురాల్లో పాల్గొనడానికి సంగం వెళ్లారు. ఇంతలోనే తాను సాగు చేస్తున్న 0.29 సెంట్ల భూమిలో రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారని ఇంటి నుంచి ఫోన్‌లో చెప్పారు. ఇదే విషయమై ఆయన నేరుగా తహసీల్దార్ దగ్గరకు వెళ్లారు. దీని పై ప్రశ్నించగా.. పై అధికారులు ఒప్పుకోవడం లేదని, తానేమీ చేయలేనని తహశీల్దార్ చెప్పారు. అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగి నేరుగా పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ కర్రలతో హద్దులు ఏర్పాటు చేసి ఉండటాన్ని చూసి మనస్తాపం చెందాడు. పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే స్థానికులు గమనించి వెంటనే అడ్డుకున్నారు. కానీ, కొంత పెనుగులాట జరిగింది. గుండె నొప్పిగా ఉందంటూ స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: జగన్ కు భర్త్ డే గిప్ట్ గా నకిలీ బ్రాండ్ మద్యం బాటిల్..: తెలుగు మహిళల వినూత్న నిరసన

కాగా, గతేడాది జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం, శ్రీనివాసులు రెడ్డి ఎకరా పొలం ప్రభుత్వం తీసుకుంది. శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలోనే లే అవుట్ వేశారు. కానీ, ఆ ఎకరాకు ప్రభుత్వం ఇస్తాన్న రూ. 15 లక్షలు ఇవ్వలేదు. కాగా, పది రోజుల క్రితం ఇస్తామన్న 0.29 సెంట్ల భూమిలో గోదాములు కట్టాలని, వరి నాటిన పొలంలో ట్రాక్టర్ తొక్కించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని శ్రీనివాసులు రెడ్డి మంత్రి ఓఎస్‌డీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అధికారులను మందలించినట్టు తెలిసింది. 

click me!