వైసీపీ కార్యకర్త సుబ్బారావుపై దాడి : పోలీసుల అదుపులో మంత్రి బాలినేని అనుచరుడు సుభాని

Siva Kodati |  
Published : Dec 21, 2021, 08:55 PM IST
వైసీపీ కార్యకర్త సుబ్బారావుపై దాడి : పోలీసుల అదుపులో మంత్రి బాలినేని అనుచరుడు సుభాని

సారాంశం

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం ఏపీలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం ఏపీలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ క్రమంలో గుప్తాపై దాడి చేసిన సుభానీని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

కాగా.. సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభాని  సోమవారం నాడు దాడికి దిగారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని తీరుతో వైసీపీకి నష్టమని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సుబ్బారావు కన్పించకుండా పోయాడు. గుంటూరులోని లాడ్జీలో ఉన్న సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు.

ALso Read:నేనేప్పుడూ మంత్రికి విధేయుడినే: బాలినేని ఇంట్లో సుబ్బారావు ప్రత్యక్షం

మరోవైపు సుబ్బారావు గుప్తా మంగళవారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. మంగళవారం నాడు ఏపీ మంత్రి Balineni Srinivas Reddy ఇంట్లో Subba Rao గుప్తా ప్రత్యక్షమయ్యారు. సీఎం Ys Jagan జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కేక్ ను మంత్రికి సుబ్బారావు తినిపించారు. సుబ్బారావుకు మంత్రి కేక్ తినిపించారు. Ongole నుండి కొందరు Ycp  నేతలు ఇవాళ ఉదయం Vijayawadaకు  సుబ్బారావు గుప్తాను తీసుకెళ్లారు. తనపై దాడి వివరాలను సుబ్బారావు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. ఆ తర్వాత సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సుబ్బారావు గుప్తా మీడియాతో మాట్లాడారు.  Subhani అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణమని సుబ్బారావు  చెప్పారు.తాను  మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని  వెంట వున్నానని గుర్తు చేసుకొన్నారు.తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరన్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో ఈ వ్యాఖ్యలు  చేశానని చెప్పారు.మంత్రి బాలినేని  శ్రీనివాస్ రెడ్డి తనపై దాడి చేయించారనే వార్తలను  సుబ్బారావు గుప్తా ఖండించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్