presidential election 2022 : ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ద్రౌపది ముర్ము ఫోన్.. మద్ధతిచ్చినందుకు థ్యాంక్స్

By Siva KodatiFirst Published Jun 26, 2022, 3:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ఫోన్ చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఆమెకు మద్ధతు తెలిపిన సంగతి తెలిసిందే. 
 


రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో (president election 2022) ఎన్డీఏ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము (draupadi murmu) ఆదివారం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో (ys jagan) సంభాషించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌న మ‌ద్ద‌తును ఎన్డీఏ అభ్య‌ర్థికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముర్ము నామినేష‌న్ ప‌త్రాల‌పై వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి (vijayasai reddy) , మిథున్ రెడ్డిలు (mithun reddy) సంత‌కాలు చేశారు.

ఇప్ప‌టికే త‌న నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముర్ము... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఆదివారం జ‌గ‌న్‌తో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఓటింగ్‌పై వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగినట్లు స‌మాచారం. అంతేకాకుండా త‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌కు ముర్ము కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

షనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి శనివారం ప్రకటించారు. ‘‘ పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ఒక ముఖ్యమైన భాగమని భావించి రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని BSP నిర్ణయించింది ’’ అని తెలిపారు. 

Also REad:presidential election 2022 : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు - మాయావ‌తి

బీజేపీని స‌పోర్ట్ చేయ‌డం అలాగే కాంగ్రెస్ ను వ్య‌తిరేకించ‌డ‌మో త‌మ నిర్ణ‌యం ఉద్దేశం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘ ఈ నిర్ణయం బీజేపీకి లేదా ఎన్ డీఏకు మద్దతు ఇవ్వడానికి లేదా ప్రతిపక్ష యూపీఏకు వ్యతిరేకంగా వెళ్ళడానికో కాదు. కానీ సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను దేశానికి రాష్ట్రపతిగా చేయాలనేది మా పార్టీ ఉద్దేశం. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం.’’ అని ఆమె చెప్పారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే ముందు ఒక్క సారి కూడా తన‌ను సంప్ర‌దించ‌లేద‌ని మాయావ‌తి అన్నారు. కాబ‌ట్టి ఎన్నికలపై తమ పార్టీకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని ఆమె అన్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన బీజేపీ నాయ‌కురాలు ముర్మును రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించారు. జార్ఖండ్ గవర్నర్ గా పూర్తి స్థాయిలో ప‌ని చేసిన 64 ఏళ్లు ముర్ము.. ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఒడిశాకు చెందిన తొలి మ‌హిళ‌గా, అలాగే రాష్ట్రప‌తి ప‌దవిని అధిరోహించిన తొలి గిరిజ‌న మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ నేతృత్వంలోని జేఎంఎం, జనతాదళ్ (సెక్యులర్) కూడా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 

అయితే ప్ర‌తిప‌క్షాలు తమ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మాజీ కేంద్ర మంత్రి ఉపాధ్య‌క్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హాను (yashwant sinha) ప్రతిపక్షాలు ప్రకటించాయి.గ‌తంలో విప‌క్ష అభ్య‌ర్థిగా శ‌రద్ పవార్, గోపాల‌కృష్ణ గాంధీ, ఫ‌రుక్ అబ్దుల్లా పేర్ల‌ను ప్ర‌తిపాదించ‌గా.. వారు సున్నితంగా తిర‌స్క‌రించారు. దీంతో టీఎంసీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న య‌శ్వంత్ సిన్హా పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో ఆయ‌న టీఎంసీకి రాజీనామా చేశారు. అనంత‌రం సిన్హా పేరు అధికారంగా ప్ర‌క‌టించారు. కాగా ప్రస్తుత రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకోవడానికి జూలై 18వ తేదీన ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు జూన్ 29 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూలై 21వ తేదీన వెలువ‌డుతాయి. రామ్ నాధ్ కోవింద్ ప‌ద‌వి కాలం జూలై 24వ తేదీన ముగియ‌నుంది. 
 

click me!