ఆత్మకూరు ఉప ఎన్నికలు: ఓట్లు పెంచుకున్న బీజేపీ

Published : Jun 26, 2022, 02:16 PM ISTUpdated : Jun 26, 2022, 02:50 PM IST
 ఆత్మకూరు ఉప ఎన్నికలు: ఓట్లు పెంచుకున్న బీజేపీ

సారాంశం

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో  2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 17 వేల ఓట్లను ఎక్కువగా సాధించింది బీజేపీ.,ఈ దఫా వైసీపీ, బీజేపీకి మధ్య మాత్రమే పోటీ నెలకొంది.

నెల్లూరు: Atamakur అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో BJP  గతంలో కంటే అధిక ఓట్లను సాధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 2314 ఓట్లు మాత్రమే దక్కాయి. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ కు 19,352‌ ఓట్లు సాధించాడు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించాడు. హైద్రాబాద్ లోని తన నివాసంలో మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  

also read:మంత్రులు,అగ్రనేతలు ప్రచారం చేసినా ఆశించిన మెజారిటీ రాలేదు: ఆత్మకూరు ఫలితాలపై బీజేపీ అభ్యర్ధి భరత్

ఈ ఉప ఎన్నికల్లో TDP  పోటీ చేయలేదు. మరణించిన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపిన సమయంలో పోటీకి నిలపకూడదని గతం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ ఉప ఎన్నికల్లో BJP  పోటీ చేసింది.  బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు Bharath Kumar పోటీలో నిలిచారు.  బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కర్నాటి ఆంజనేయ రెడ్డికి కేవలం 2314 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ దఫా పోటీ చేసిన బరత్ కుమార్ మాత్రం 19,352 దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఈ దఫా టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ వైసీపీ , బీజేపీ మధ్యే నెలకొంది. దీంతో బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ నేతలు కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ఓట్లను పెంచుకున్నప్పటికీ వైసీపీకి బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. YCP  నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల ఆ పార్టీ భారీ మెజారిటీని సాధించిందని కూడా కమలనాథులు ఆరోపణలు చేస్తున్నారు.గతంంలో కంటే బీజేపీ ఓట్లను పెంచుకొంది. కానీ డిపాజిట్ మాత్రం  దక్కించుకోలేకపోయింది.కనీసం 22 వేల ఓట్లను బీజేపీ సాధిస్తే డిపాజిట్ దక్కి ఉంేది, కానీ బీజేపీ 19 వేల ఓట్లకు మాత్రమే పరిమితంైంది. దీంతో ఆ పార్టీ డిపాజిట్ ను దక్కించుకోలేకపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!