అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

By narsimha lodeFirst Published Sep 14, 2018, 3:14 PM IST
Highlights

బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఆందోళన కేసులో ఐదేళ్లకు ముందే  చార్జీషీట్  దాఖలు చేసినట్టు  నాందేడ్ ఎస్పీ కతార్ చెప్పారు


ముంబై:బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఆందోళన కేసులో ఐదేళ్లకు ముందే  చార్జీషీట్  దాఖలు చేసినట్టు  నాందేడ్ ఎస్పీ కతార్ చెప్పారు.  బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో నిర్వహించిన ఆందోళన  సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా సుమారు 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు  నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడారు.  బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు.  ఐదేళ్లకు ముందే చార్జీషీట్ ను దాఖలు చేసి ఆ ప్రతులను నిందితులుగా ఉన్న వారికి పంపించినట్టు ఆయన చెప్పారు.  

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకొన్నారనే ఆరోపణలతోనే ఈ కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. ఆనాటి వీడియోలు, ఫోటోలను సాక్ష్యాలను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. 

16 మందిపై  చార్జీషీట్ దాఖలైందన్నారు. కేసులో అభియోగాలు నమోదు చేసిన తర్వాత  విచారణ తతంగం కోర్టు పరిధిలోనే ఉంటుందని ఎస్పీ చెప్పారు.ఎవరిని ఎప్పుడు విచారణకు పిలవాలనే విషయం కోర్టు చూసుకొంటుందన్నారు. 

చంద్రబాబు సహా 16 మంది నిందితులను ఈ నెల 21 వ తేదీలోపుగా హాజరుపర్చాలని  ధర్మాబాద్ కోర్టు నుండి తమకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ లోపుగా నిందితులు హాజరౌతారని భావిస్తున్నట్టు చెప్పారు. బాబు సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కాకుంటే న్యాయసలహా తీసుకొని అరెస్ట్ చేసి తరలిస్తామన్నారు.

ఈ వార్తలు చదవండి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు
బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ

'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

click me!