చంద్రబాబుకి రఘువీరా రెడ్డి మద్దతు

Published : Sep 14, 2018, 03:10 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
చంద్రబాబుకి రఘువీరా రెడ్డి మద్దతు

సారాంశం

ప్రజాపోరాటాలు చేస్తే కేసులు పెట్టడం సరికాదని, ఏపీలోనూ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మద్దతుగా నిలిచారు. బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్ కోర్టు సీఎం చంద్రబాబుకి నోటీసులివ్వడాన్ని రఘువీరా రెడ్డి తప్పుబట్టారు.

బాబ్లీ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన చంద్రబాబు పై కేసు పెట్టడం ముమ్మాటికీ తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాపోరాటాలు చేస్తే కేసులు పెట్టడం సరికాదని, ఏపీలోనూ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.
 
మరోవైపు బాబ్లీ కేసులో ఐదేళ్ల క్రితం చార్జిషీట్ వేశామని, చార్జిషీట్‌ వేశాక అంశం కోర్టు పరిధిలో ఉంటుందని నాందేడ్‌ ఎస్పీ కతార్‌ తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారని, 16 మందిపై చార్జిషీట్‌ వేశామని చెప్పారు. 21న హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించిందని, నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కోర్టు విచక్షణాధికారానికి చెందినదని కతార్‌ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే