చంద్రబాబును అరెస్ట్ చేస్తే మమ్మల్సి జైల్లో పెట్టమంటాం: మురళీమోహన్

Published : Sep 14, 2018, 02:38 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
చంద్రబాబును అరెస్ట్ చేస్తే మమ్మల్సి జైల్లో పెట్టమంటాం: మురళీమోహన్

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై రాజమహేంద్రవరం ఎపీ మురళీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 

రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై రాజమహేంద్రవరం ఎపీ మురళీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టమంటామని ఎంపీ మురళీమోహన్‌ స్పష్టం చేశారు.

సినీ నటుడు శివాజీ చెప్పినట్లు ఏపీలో ఆపరేషన్ గరుడ జరుగుతోందని మురళీమోహన్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును అప్రతిష్టపాలు చేయడం బీజేపీకి సాధ్యం కాదన్నారు. నవ్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడును అడ్డుకోలేక ఇలాంటి కుట్రలకు బీజేపీ పాల్పడుతుందని మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?