చంద్రబాబు-పవన్ సోమవారం భేటీ

Published : Jul 16, 2017, 07:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
చంద్రబాబు-పవన్ సోమవారం భేటీ

సారాంశం

సోమవారం జరగనున్న చంద్రబాబు-పవన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చంద్రబాబు జనసేనానికి ఎందుకు అపాయిట్మెంట్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఉథ్థానం కిడ్నీ బాధితుల గురించి మాట్లాడటానికి మత్రమే వీరిద్దరూ కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఎవ్వరూ నమ్మటం లేదు.

చాలా కాలం తర్వాత చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ సోమవారం జరుగుతోంది. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నకల బిజీ షెడ్యూల్లో ఉండి కూడా చంద్రబాబు జనసేన అధ్యక్షుడిని కలవటానికి సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వటం సర్వత్రా ఆశక్తిని రేపుతోంది.  మరో రెండేళ్లల్లో సాధారణ ఎన్నికలుండగా పవన్ అప్పుడప్పుడు చమక్ అంటూ మెరుస్తున్నారు ట్విట్టర్లో. అయితే, ఆమధ్య ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల పరామర్శ పేరుతో కొంత హడావుడి చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అప్పుడప్పుడు ట్విటర్లో స్పందించటం తప్ప జనాల్లోకి వచ్చింది పెద్దగా లేదు.

ఒకవైపు వైసీపీ ప్లీనరీ తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కింది. ఇంకా ఎన్నిక షెడ్యూల్ రాకపోయినా నంద్యాల హీట్ పెంచేస్తోంది. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు-పవన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చంద్రబాబు జనసేనానికి ఎందుకు అపాయిట్మెంట్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఉథ్థానం కిడ్నీ బాధితుల గురించి మాట్లాడటానికి మత్రమే వీరిద్దరూ కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఎవ్వరూ నమ్మటం లేదు. వీరిద్దరి మధ్య కీలక రాజకీయ చర్చలేవో జరగబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది.  కుల సంఘాల యాత్రలు, నంద్యాలలో మద్దతు, ముద్రగడ వ్యవహారం తదితర అంశాలపై చర్చలుంటాయని ప్రచారం జరుగుతోంది.  మరి, చూడాలి సోమవారం భేటీ తర్వాత ఏ విషయాలు బయటకు వస్తాయో.

PREV
click me!

Recommended Stories

తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu
ISRO Set to Launch LVM3-M6 with BlueBird Block-2 Satellite | Students Reaction | Asianet News Telugu