వారసుడే మంత్రి అక్కడ..

Published : Jul 16, 2017, 10:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వారసుడే మంత్రి అక్కడ..

సారాంశం

అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మంత్రి కొడుకు రాజగోపాలరెడ్డి వచ్చారు. రావటంతోనే కాలువ  తూముల వద్ద పూజలు మొదలుపెట్టేసారు. పూజ పూర్తిచేసిన వెంటనే తూముల ద్వారా నీటిని విడదల కూడా చేసేసారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారసుడే నియోజకవర్గంలో మంత్రి. ఎలాగంటే, నియోజకవర్గంలో ఏ పనులు మొదలుకావాలన్నా వారసుడి హోదాలో సోమిరెడ్డి రాజగోపాలరెడ్డే చేసేస్తుంటారు. తాజాగా పొదలకూరులో కండలేరు ఎడమగట్టు కాలువపై రూ. 60 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అధికారులు ఈమధ్యనే ట్రయల్ రన్ కూడా చూసారు. మంత్రి చంద్రమోహన్ రెడ్డి త్వరలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేస్తారని అధికారులు కూడా ప్రకటించారు.

ప్రారంభోత్సవానికి తేదీ కూడా నిర్ణయమైంది. దాంతో శనివారం నాడు అధికార యంత్రాంగమంతా పథకం నిర్మించిన చోటకు వచ్చింది. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మంత్రి కొడుకు రాజగోపాలరెడ్డి వచ్చారు. రావటంతోనే కాలువ  తూముల వద్ద పూజలు మొదలుపెట్టేసారు. పూజ పూర్తిచేసిన వెంటనే తూముల ద్వారా నీటిని విడదల కూడా చేసేసారు. దాంతో అధికారులకు ఏం మాట్లాడాలో అర్దం కాలేదు. ఎప్పుడైతే మంత్రి చేయాల్సిన కార్యక్రమాలను ఆయన కొడుకు చేసాడో ప్రోటోకాల్ సమస్య వస్తుందనుకున్న అధికారులు కార్యక్రమానికి దూరంగా వెళ్లిపోయారు. దాంతో అధికారులను పక్కన బెట్టేసి మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే చక్కబెట్టేసారు.

PREV
click me!

Recommended Stories

LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu
తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu