టిడిపి ఎంఎల్ఏపై ఏసిబి కేసు

Published : Jul 16, 2017, 09:39 AM ISTUpdated : Mar 24, 2018, 12:02 PM IST
టిడిపి ఎంఎల్ఏపై ఏసిబి కేసు

సారాంశం

విదర్భ ఇరిగేష్ డెవలప్మెంట్ కార్పొరేష్ పనులలో ఎంఎల్ఏ భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లరూపాయలు దోచేసారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసారు. బొల్లినేని కంపెనీకి సహకరించారన్న ఆరోపణలపై అక్కడి ఇర్రిగేషన్ ఉన్నతాధాకారులపై కూడా ఏసిబి కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టులు కూడా చేసేసింది. ఈరోజో రేపో ఎంఎల్ఏను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం.   ఏసిబి కేసు నమోదైన బొల్లినేనిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి?

నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి ఎంఎల్ఏ బొల్లినేని రామారావుపై ఏసిబి పోలీసులు కేసు నమోదు చేసారు. అదికూడా మహారాష్ట్ర ఏసిబి నమోదు చేయటం పార్టీలో కలకలం రేపింది. కేసు నమోదు చేసిన ఏసిబి నెల్లూరు జిల్లాలోని ఎంఎల్ఏ ఆస్తులు, వ్యాపారాలపై విచారణ మొదలుపెట్టింది. విదర్భ ఇరిగేష్ డెవలప్మెంట్ కార్పొరేష్ పనులలో ఎంఎల్ఏ భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లరూపాయలు దోచేసారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసారు. బొల్లినేని కంపెనీకి సహకరించారన్న ఆరోపణలపై అక్కడి ఇర్రిగేషన్ ఉన్నతాధాకారులపై కూడా ఏసిబి కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టులు కూడా చేసేసింది. ఈరోజో రేపో ఎంఎల్ఏను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం.  

టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నేతల అవినీతికి అంతేలేకుండా పోతోంది. అందరికీ కల్పతరువుగా కనిపించింది నీటా పారుదల ప్రాజెక్టులే. ఎందుకంటే, నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని నిరూపించటం అంత తేలిక్కాదు. ఉదాహరణకు ప్రాజెక్టు మట్టి పనే తీసుకుంటే, మట్టి పోసింది తెలీదు, తవ్విందీ తెలీదు. వర్షానికి మట్టి కొట్టుకునిపోయిందని చెప్పవచ్చు. అదేవిధంగా, కాల్వపనులు, పూడికపనులు. తాము కాల్వలు, పూడికలు తీసినా, తవ్వినా తర్వాత పూడికుపోయాయని చెప్పవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా కాల్వలు తవ్వవచ్చు, పూడికలు తీయవచ్చు, మట్టి తీసి పోయవచ్చు. ఇటువంటి పనుల్లోనే కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దోచేస్తుంటారు.

టిడిపి ఎంఎల్ఏ బొల్లినేని పైన కూడా ఇటువంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయ్. అదే బొల్లినేని ఏపిలో కూడా అనేక పనులు చేస్తున్నారు. ఇక్కడెక్కడా అధికారులు ఎంఎల్ఏ పైన కేసులు నమోదు చేయలేదు. ఎందుకంటే, మహారాష్ట్రలోని అక్రమాలకు పాల్పడ్డారంటే సొంత రాష్ట్రంలో పాల్పడకుండానే ఉంటారా? అయినా సొంత రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆరోపణలు వినబడలేదనుకోండి. మరి, కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ఏసిబి ఎంఎల్ఏను అరెస్టు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఏసిబి నమోదైన బొల్లినేనిపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి?

 

PREV
click me!

Recommended Stories

LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu
తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu