విజయదశమి రోజున ఎపి అసెంబ్లీకి శంకుస్థాపన

Published : Sep 10, 2017, 08:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
విజయదశమి రోజున ఎపి అసెంబ్లీకి శంకుస్థాపన

సారాంశం

శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

విజయదశమి రోజే ఏపీ అసెంబ్లీకి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబుఈ రోజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో 1350 ఎకరాల్లో పరిపాలనా కేంద్రం ఏర్పాటు  అవుతున్నదని అన్నారు.  12న అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల డిజైన్లపై సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో నార్మన్‌ఫోస్టర్స్‌ బృందం చర్చలు జరుపుతుందని ఆయన వెల్లడించారు. 13 వ తేదీన అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లను ఖరారుచేస్తామని అన్నారు. మరో రెండు రోజుల్లో బ్రిటన్‌ ఆర్కిటెక్ట్‌ల బృందం విజయవాడ రాబోతున్నట్లు చెప్పారు. బహుళ అంతస్థుల హౌసింగ్‌ నిర్మాణాలకు కూడా పండుగ రోజే  ఆయన శంకుస్థాపన చేస్తారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీరంవైపే దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ ఐదు తెలుగు జిల్లాల్లో వర్షాలు
Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం | Asianet News Telugu