ఫిరాయింపు ఎంఎల్ఏకు చంద్రబాబు షాక్

First Published Sep 10, 2017, 10:24 AM IST
Highlights
  • కడప జిల్లా బద్వేల్ ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు.
  • తీరు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా కష్టమేనంటూ స్పష్టం చేయటంతో జయరాముల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది.
  • బద్వేలు నియోజకవర్గంలో టిడిపి నేతలకు, ఫిరాయింపు ఎంఎల్ఏకు మొదటి నుండి పడటం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.
  •  

కడప జిల్లా బద్వేల్ ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తీరు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా కష్టమేనంటూ స్పష్టం చేయటంతో జయరాముల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే, కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యటనకు వెళ్ళేందుకు చంద్రబాబు కొద్దిసేపు శనివారం కడప విమానాశ్రమంలో ఆగారు. ఆ సందర్భంగా జిల్లా నేతలతో పాటు ఎంఎల్ఏ కుడా చంద్రబాబును కలిసారు.

బద్వేలు నియోజకవర్గంలో టిడిపి నేతలకు, ఫిరాయింపు ఎంఎల్ఏకు మొదటి నుండి పడటం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ విషయంలోనూ జయరాములుకు మిగిలిన నేతలతో  ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయి. అదే విషయాన్ని జయరాములు సిఎంకు చెప్పారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు, తనకు ఎదురైన అవమానాలు వివరిచాంరు. తాను ప్రతిపాదిస్తున్న అభివృద్ధిపనులను కొందరు నేతలు అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. ఎప్పుడైతే జయరాములు ఫిర్యాదులు మొదలుపెట్టారో వెంటనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఫిరాయింపు ఎంఎల్ఏను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ముందు నీ పద్దతి మార్చుకో’ అని హెచ్చరించారు.  ‘‘అదరినీ కలుపుకుపోవటం నేర్చుకో..నీవు ఫిర్యాదు చేస్తున్న నేతలందరూ మొదటి నుండి టిడిపిలోనే ఉన్నారన్న సంగతి గుర్తుంచుకో’’ అంటూ క్లాసు పీకారు. ‘‘అభివృద్ధిపేరుతో అందరికన్నా ఎక్కువ నిధులు నీవే తీసుకున్నావు, ఇలా అయితే నీతో ఇబ్బందే‘’’ అని గట్టిగా చెప్పారు. ‘‘పద్దతి మార్చకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా కష్టమే’’ అని స్పష్టంగా చెప్పారు.  చంద్రబాబు నుండి ఊహించని రియాక్షన్, అందులోనూ అందరిముందు రావటంతో జయరాముల్లో ఆందోళన పెరిగిపోయింది. చంద్రబాబు మనసులోని మాట జయరాములు విషయంలో బయటపడిందని, ఇంకెంతమంది ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో ఇదే అభిప్రాయంతో సిఎం ఉన్నారో ఏమో?

click me!