చంద్రబాబుపై నేతల ఒత్తిడి

Published : Nov 29, 2016, 09:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
చంద్రబాబుపై నేతల ఒత్తిడి

సారాంశం

సమస్య నుండి కేంద్రం తప్పుకుని ఎదురవ్వబోయే పరిణామాలను చంద్రబాబు తలకు చుట్టాలని చూస్తున్నట్లుందని టిడిపి ఎంపి శివప్రసాద్ బాహటంగానే ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

‘ముఖ్యమంత్రుల కమిటికి తమ సారు సారధ్యం వహించటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు’. ‘తప్పు వాళ్ళు చేసి బాధ్యత మా నేతపై తోసేస్తారేమోనని మా భయం’..ఇది తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యాఖ్యలు. పెద్ద నోట్ల రద్దు, తదనంతరం తలెత్తిన పరిణామాలపై ఈ వ్యాఖ్యలు చాలు టిడిపి నేతల ఆందోళన తెలుసుకోవాడానికి.

 

నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటిని నయమించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పాండిచ్చేరి సిఎం నారాయణస్వామి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, మధ్యప్రదేశ్ సిఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ ల కమిటికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కన్వీనర్ గా నియమితులయ్యారు.

 

ఈ విషయంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పిన దగ్గర నుండి పార్టీ వర్గాలు వద్దని వారిస్తున్నట్లు సమాచారం. చెలామణిలో ఉన్న వెయ్యి, రూ. 500 పెద్ద నోట్లను ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏకపక్షంగా రద్దు చేసారు. అయితే, కేంద్రం ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దేశ ఆర్ధిక వ్యవస్ధ దాదాపు కుదేలైపోయింది.

 

ఒక విధంగా దేశం మొత్తం ఆర్ధిక ఎమర్జెన్సీ విధించినట్లైంది. దాంతో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చేసారు. దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగిపోయిన 21వ రోజున కేంద్రం ఐదుగురు సిఎంలతో ఓ కమిటి వేసి చంద్రబాబును కన్వీనర్ గా నియమించటం గమనార్హం. నోట్ల రద్దు తర్వాత మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో ఇంత వరకూ మోడి హాజరవ్వకపోవటమే కేంద్రప్రభుత్వ ఆందోళనను తెలియచెబుతోంది.

 

21 రోజుల తర్వాత పరిస్ధితిని చక్కదింద్దేందుకు కమిటి వేయటమంటే టిడిపి నేతల దృష్టిలో ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటమే’. అందుకనే ఆ కమిటికి చంద్రబాబు సారధ్యం వహించకూడదని చెబుతున్నారు.

 

సమస్య దేశవ్యాప్తంగా ముదిరిపోయిన తర్వాత ఇపుడు కమిటి వేసి ఉపయోగమేమిటని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. సమస్య నుండి కేంద్రం తప్పుకుని ఎదురవ్వబోయే పరిణామాలను చంద్రబాబు తలకు చుట్టాలని చూస్తున్నట్లుందని టిడిపి ఎంపి శివప్రసాద్ బాహటంగానే ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?