(వీడియో) తెలంగాణాపై చంద్రబాబు మనసులో ఏముంది ?

Published : Nov 03, 2017, 10:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(వీడియో) తెలంగాణాపై చంద్రబాబు మనసులో ఏముంది ?

సారాంశం

అరచేతిలో ఏముందో ఎవరికి వారు ఊహించుకోవాలే గానీ తెరిచి చూపించకూడదన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తుంటారు.

‘రాజకీయాల్లో ఏం చేయాలో కొన్ని కొన్ని చెప్పకూడదు..చెప్పి చేసేది రాజకీయం కాదు, అది సరైన స్ట్రాటజీ కూడా కాదు’

‘అరచేతిలో ఏముందో ఎవరికి వారు ఊహించుకోవాలే గానీ, తెరిచి చూపిస్తే ఏమీ కనబడదు’

ఇవి టిటిడిపి సమావేశంలో చంద్రబాబునాయడు చేసిన తాజా వ్యాఖ్యలు. ఇపుడీ వ్యాఖ్యలపైనే పార్టీలో చర్చ మొదలైంది. ఎందుకంటే, పై వ్యాఖ్యలు చంద్రబాబు నైజానికి సరిగ్గా సరిపోతుందని సీనియర్లు అంటున్నారు. అరచేతిలో ఏముందో ఎవరికి వారు ఊహించుకోవాలే గానీ తెరిచి చూపించకూడదన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అలాగే, రాజకీయల్లో ఏం చేయాలో కొన్ని కొన్ని చెప్పకూడదని కూడా అన్నారు. అదేవిధంగా, చెప్పి చేసేది రాజకీయం కాదని మంచి స్ట్రాటజీ కూడా కాదని స్పష్టం చేసారు.

ఏ విషయంలో అయినా కానీండి, చంద్రబాబు మనసులో ఏముందో ఎవరికీ తెలీదు చివరి నిముషం వరకూ. అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్ల కేటాయింపు విషయంలో కూడా చాలా నియోజకవర్గాల్లో నామినేషన్ చివరి రోజు వరకూ టిక్కెట్టు ఎవరికిచ్చేది కూడా తేల్చరు. ఆ విషయం ఎన్నో సార్లు రుజువైంది. అంతేకాకుండా కార్పొరేషన్ల నియోమకాలు కానీండి, పార్టీ పదవులు కానీండి చంద్రబాబు మనసులో ఏముందో ఎవరూ కనుక్కోలేరన్నది జగమెరిగిన సత్యం.

ఇంతకాలం చంద్రబాబు గురించి పార్టీలో గానీ బయటకానీ అందరూ చెప్పుకునే మాటలే అవి. అటువంటిది తన నైజాన్ని (స్ట్రాటజీ) తనంతట తానుగా చంద్రబాబు బయటపెట్టేసుకోవటం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇందులో కూడా ఏమైనా స్ట్రాటజీ ఉందా అన్న విషయం అర్ధం కాక పలువురు సీనియర్లు జుట్లు పీక్కుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం