రూ. 2 వేల నోటు రద్దా ? మరో తుగ్లక్ చర్యేనా ?

Published : Nov 03, 2017, 09:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రూ. 2 వేల నోటు రద్దా ? మరో తుగ్లక్ చర్యేనా ?

సారాంశం

పెద్ద నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకొబోతోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

పెద్ద నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకొబోతోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. త్వరలో రూ. 2 వేల నోట్లను రద్దు చేయాలని కేంద్రం అనుకుంటోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతమొస్తోంది. ఎందుకంటే, రూ. 2 వేల నోట్ల ముద్రణను  సెక్యూరిటీ ప్రింటింగ్ అడ్ మింటింగ్ కార్పొరేషన్ నిలిపేసింది. పోయిన సంవత్సరం పెద్ద నోట్లను ప్రధానమంత్రి నరేంద్రమోడి హటాత్తుగా రద్దు చేసిన తర్వాత ఆర్ధికంగా దేశం ఇంకా ఇబ్బందులు పడుతునే ఉంది. అటువంటిది మళ్ళీ పెద్ద నోట్ల ముద్రదణను నిలిపేయటమంటే ఆశ్చర్యంగా ఉంది. హటాత్తుగా ముద్రణను ఎందుకు నిలిపేశారన్నదే పెద్ద ప్రశ్న. రద్దు నిజమే అయితే కచ్చితంగా అది తుగ్లక్ చర్యగానే భావించాలి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత అప్పట్లో నరేంద్రమోడి కానీ అరుణ్ జైట్లీ కానీ ఎన్ని కథలు చెప్పారో అందరకీ గుర్తుండే ఉంటుంది. ఉగ్రవాదం నియంత్రణకన్నారు, దొంగనోట్లను అదుపు చేయటంకోసమని, నల్లధనాన్ని బయటకు తీయటం కోసమని..ఇలా చాలానే చెప్పారు. ప్రధాని చెప్పింది విని నిజమే అనుకున్న జనాలు ఎంత కష్టమైనా పంటిబిగువున భరించారు. కష్టాలను ఇంకా భరిస్తూనే ఉన్నారు. అప్పట్లో కేంద్రం చెప్పిందేమీ జరగలేదు. అదే సందర్భంలో కొత్తగా ముద్రించిన రూ. 2 వేలు, రూ. 5 వందలతో పాటు రూ. 100, రూ. 50 నోట్లే ఇంకా జనాల్లోకి పూర్తిగా చేరలేదు. అటువంటిది మళ్ళీ రూ. 2 వేల నోటు రద్దంటే ఆర్ధిక రంగంపైనే కాకుండా జనాల నెత్తిన కూడా మరో పెద్ద బండ వేసినట్లే.

అధికారికంగా ఆదేశాలు బయటకు రాకపోయినా నోట్ల ముద్రణ నిలిపి వేయటాన్ని బట్టి విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వచ్చే సంవత్సరంలో మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలొస్తాయి. ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మోడి మహానుభావుడు ఏం చేస్తారో?

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే