
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రజా సకల్ప యాత్ర 6వ తేదీ ప్రారంభమవుతున్న నేపధ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సుల కోసం తిరుమలకు వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకుంటున్న జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం బ్రేక్ లో వెంకన్నను దర్శించుకుంటారు. తర్వాత మధ్యాహ్న సమయంలో కడపకు బయలుదేరుతారు.