సర్పంచు మీద ఓటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి

First Published Jan 11, 2017, 4:29 AM IST
Highlights

జన్మభూమిలో  సర్పంచుకు చంద్రబాబు హితవు

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుండి ఒక  సర్పంచు పాపులారిటీ కనుక్కోవాలనుకున్నారు.

 

నిన్న ఆయన  నెల్లూరు జిల్లా చెన్నూర్ లో నిర్వహించిన  జన్మభూమి  సభలో అంగన్ వాడి రిపోర్ట్ను పరిశీలించారు. అంగన్ వాడీ పనితీరును సంబంధిత మహిళా అధికారి వివరిస్తుండగా, ఆ కేంద్రంలో  ఓ శిశువు మరణించినట్లు బయటపడింది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించారు.  వెంటనే దాని మీద చర్చ మొదలయింది. ఒక పురిటిబిడ్డ చనిపోయేందుకు కారణమేమిటని ఆయన అంగన్ వాడి బాధ్యురాలిని అడిగారు. పుట్టుకతో గుండెకు రంధ్రం ఉండిందని, అందు వల్ల చనిపోయినట్లు ఆమెసమధానమిచ్చారు.

 

సంతృప్తి చెందని ముఖ్యమంత్రి అంగన్ వాడీ ఆయా ఎవరని అడిగారు. ఆమె లేచి నిలబడ్డారు. పురిటి బిడ్డ ఎలా  చనిపోయిందో చెప్పమన్నారు.

 

పురిటిబిడ్డ చనిపోవడంలో తమ తప్పు లేదని, బిడ్డ పుట్టేటప్పుడే అనారోగ్యంతో పుట్టిందని దాని వల్లే చనిపోయిందని ఆమె వివరణ ఇచ్చారు.  గ్రామ సర్పంచ్ ఎవరని ముఖ్యమంత్రి అడగగా సర్పంచ్ శివకుమార్ లేచి నిలబడ్డారు.  ఆయన్ని కూడా బిడ్డ ఎందుకు చనిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు.

 

ఆరోగ్యం బాగా లేకచనిపోయినట్లు సర్పంచు కూడా సమాధానమిచ్చారు.

 

 అపుడు ముఖ్యమంత్రి , కొద్దిగా అంసతృప్తివ్యక్తం చేస్తూ, సర్పంచ్ పని తీరు గురించి సభలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నారు.

 

వెంటనే ఓటింగ్ పెట్టారు. గ్రామసర్పంచు ఎలా పనిచేస్తున్నాడని జన్మభూమికి హాజరయిన వారిని అడిగారు. ‘ ఆయన బాగా పనిచేస్తున్నాడనే వాళ్లంత చేతులెత్తండి,’ అని అన్నారు. రెండు నిమిషాలు సమయమిచ్చారు. అయితే, ఒక్కరు కూడా చేతులెత్త లేదు.  దీనితోముఖ్యమంత్రి చిరునవ్వు నవ్వుతూ నీ పనితీరు ఇలా ఉంది చూడు, సభవైపు చూపిస్తూ,  గ్రామస్థులంతా నీ మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

 

 ‘పనితీరును మెరుగుపర్చుకో. నువ్వు నీకుటుంబానికే కాదు,గ్రామానికి కూడా పెద్ద దిక్కుగా ఉండాలి,’ అని సూచించారు.

 

click me!