చంద్రబాబు విధానాలను ప్రశ్నించిన ‘ఖైదీ’

Published : Jan 11, 2017, 04:17 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
చంద్రబాబు విధానాలను ప్రశ్నించిన ‘ఖైదీ’

సారాంశం

చిరంజీవి సినిమా బాగుందన్న ప్రచారం మొదలవ్వటంతో టిడిపి వర్గాల్లో కలవరం మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్ర కథాంశం  నేరుగా చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విధంగా ఉందన్న ప్రచారం మొదలైంది. సినిమాలో విలన్ తాను నెలకొల్పానుకున్న శీతలపానీయాల సంస్ధ కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నిస్తారు. దాన్ని హీరో చిరంజీవి అడ్డుకుంటారు. ఏడాదంతా నీరుండి ఏడాదికి పుష్కలంగా మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ఎలా తీసుకుంటావని హీరో విలన్ ను ప్రశ్నిస్తారు.

 

ఈ పాయింట్ వద్దే చంద్రబాబు, టిడిపి వ్యతిరేకశక్తులు చిరంజీవి తన సినిమా ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కావచ్చు, పోర్టు, విమానాశ్రయలు ఇలా...విషయం ఏదైనా కావచ్చు పచ్చని పంట పొలాలను అభివృద్ధి పేరుతో నాశనం చేయకూడదన్నది సినిమాలో ప్రధాన సందేశంగా ప్రచారం జరుగుతోంది.

 

తెలుగుదేశంపార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు ఏదో పేరుతో పచ్చని పంట పొలాలను బలవంతంగా సేకరిస్తున్నారు. అదే విషయాన్ని చిరంజీవి తన సినిమా ద్వారా సూటిగా ప్రశ్నించారని టిడిపి వ్యతిరేక శక్తులు చెబుతున్నాయి. దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఇబ్బంది పెట్టకూడదన్న విషయాన్ని చిరంజీవి తన సినిమాలో నేరుగా చెప్పటాన్ని మెగా అభిమానులు ప్రస్తావిస్తున్నారు. రైంతాంగ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించే రీతిలో చిరంజీవి సినిమా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు.

 

చిరంజీవి సినిమా బాగుందన్న ప్రచారం మొదలవ్వటంతో టిడిపి వర్గాల్లో కలవరం మొదలైంది. సంక్రాంతి సందర్భంగా ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ సినిమాలు ఒక్కరోజు తేడాలో రిలీజు తేదీలు ప్రకటించాయి. బుధవారం రిలీజైన చిరంజీవి సినిమా ఎలావుందనే దానిపైనే గురువారం రిలీజవుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా భవిష్యత్తు ఆధారపడివుంది.

 

అందులోనూ రెండు సినిమాల విడుదల విషయంలో చోటు చేసుకున్న రాజకీయాలు, ఇద్దరు అగ్రహీరోలు రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులు కావటంతో వీరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న పరోక్ష పోరు కూడా సినిమాలపై అంచనాలు పెరిగిపోవటానికి దోహద పడ్డాయి.

 

ఇటువంటి నేపధ్యంలో రిలీజైన చిరంజీవి సినిమా బాగుందనే టాక్ రావటంతో పాటు ఏకంగా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే విధంగా ఉండటంతో కాపు సామాజిక వర్గంలో అత్యధికులు, చిరంజీవి అభిమానులతో పాటు చంద్రబాబు, టిడిపి వ్యతిరేకులు కూడా సంబరపడుతున్నారు.

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu
Vijayawada Christmas Eve Celebrations 2025: పాటలు ఎంత బాగా పడుతున్నారో చూడండి | Asianet News Telugu