Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష కొనాసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎంపీలపై జనసేన నేత నాదేండ్ల మనోహార్ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో సాగించిన పోరాటం మాదిరిగా ఆంధ్ర ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.
Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం ఉధృతం అవుతోంది. దాదాపు పది నెలలుగా ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు నిరసనలు, రిలే నిరహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షకు దిగారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ చేపట్టిన 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష' సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగనుంది. దీక్షలో జనసేన పార్టీ శ్రేణులు సైతం పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా జనసేన నేత నాదేండ్ల మనోహర్ తెలంగాణ ఎంపీలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు. రైతులు పండిస్తున్న వరి ధాన్యం విషయంలో తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్ అవరణలో రైతుల కోసం బలంగా పోరాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని నినదించారు అని నాదేండ్ల మనోహర్ న అన్నారు. అయితే, తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
Also Read: Karnataka: బంగారు నెక్లెస్‌ని మింగిన ఆవు.. ఏం చేశారంటే..
ఏపీలోని 25 మంది ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్ అవరణలో ఎందుకు పోరాడటం లేదు. తెలంగాణ ఎంపీల మాదిరిగా మీరు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడటం లేదు అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార పార్టీ వైకాపా పైనా నాదేండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయాన్ని ప్రయివేటీకరిస్తామనగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్ష కాంగ్రెస్ ను కలుపుకుని పోరాడారనీ, ఆ సంస్థను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చేశారని అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పైకాపా అధినేత, సీఎం జగన్.. విశాఖ ఉక్కు కర్మాగారంప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్షాలను కలుపుకుని పోరాటం చేయడం లేదని అన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది పార్లమెంట్ సభ్యులు Visakha Steel Plant ప్రయివేటీకరణ గురించి ప్రధాని మోడీతో ఎందుకు చర్చించడం లేదంటూ నిలదీశారు.
Also Read: Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. ఆ తర్వాత ఏం జగిందంటే?
Visakha Steel Plant ప్రయివేటీకరణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి .. అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాలనీ, Visakha Steel Plant ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంతో పాలుపంచుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరితే ఇప్పటివరకు ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దీక్షకు దిగే సమయంలో మాట్లాడుతూ Visakha Steel Plant విషయంలో కేంద్రం స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడదామని అన్నారు. రాష్ట్ర రాజధాని అంశం గురించి కూడా మాట్లాడారు. ఏపీలో ఎందుకు రాజధాని లేదని ఆయన నిలదీశారు.భారీ మెజారిటీ ఉన్న వైకాపా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయకూడదని పేర్కొన్నారు. Visakha Steel Plantను ప్రయివేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికార వైకాపా ప్రతిపక్షాలతో కలిపి ఈ పోరాటంలోకి రావాలని అన్నారు.
Also Read: black magic: కండ్లల్లో నిమ్మరసం కొడుతూ క్షుద్రపూజలు.. బయటపడ్డ మరో దొంగ స్వామీజీ బాగోతం