ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుండి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసకొంటున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదైంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు దృవీకరించారు.విదేశాల నుండి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి Omicron సోకిందని అధికారులు స్పష్టం చేశారు. Ireland నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు.ఐర్లాండ్ నుండి వచ్చిన ఈ ప్రయాణీకుడికి Mumbai ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తే కరోనా నెగిటివ్ గా వచ్చింది.Vizianagaram లో నిర్వహించిన Corona రీ టెస్టులో కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ పరీక్షల్లో ఆ వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ ఉందని తేలింది. మరో వైపు యూకే నుండి ఢిల్లీకి ఢిల్లీ నుండి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ కేసు విషయమై ఏపీ వైద్యశాఖాధికారులు మాత్రం ఈ కేసు విషయమై ఇంకా ధృవీకరించాల్సి ఉంది. .దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కి చేరుకొంది.
also read:భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్ : అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. మహారాష్ట్రలో మొత్తం 17 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 17 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.మహరాష్ట్రలోని పుణె జిల్లాలోని చించ్‌వాడ్ ప్రతంలో ఏడాదిన్నర బాలికకకు కూడా ఒమిక్రాన్ సోకిందని తేలింది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత బాలికను డిశ్చార్జ్ చేసినట్టుగా వైద్యులు ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నాడు ఢిల్లీలో రెండో కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలోని ఎల్‌జేఎన్‌పీ ఆసుపత్రిలో 35 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. యూకే నుండి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుండి ఆయన తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చిన వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ సోకిందని వైద్య శాఖాధికారులు తెలిపారు.
అయితే కరోనా ఒమిక్రాన్ కేసుల విషయంలో ఆందోళన చెందవద్దని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని అధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్క్, శానిటైజర్ ను ఉపయోగించాలని కోరారు.ఒమిక్రాన్ విషయమై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్లను అమలు చేయాలని కూడా కోరింది.దేశంలోని 10 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మిగిలిన 7 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.