AP Skill development Corporation scamలో సీఐడీ దూకుడు: పుణెలో ముగ్గురి అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 12, 2021, 12:51 PM IST
Highlights

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు పుణెలోని షెల్ కంపెనీల్లో  సోదాలు నిర్వహించారు. ఆదివారం నాడు ముగ్గురిని అరెస్ట్ చేశారు.ఇవాళ సాయంత్రానికి వారిని కోర్టులో హాజరు పర్చనున్నారు.


అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు దూకుడును పెంచారు.ఈ కేసులో పుణెకు చెందిన ముగ్గురిని ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. షెల్ కంపెనీకి చెందిన ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా పుణెలోని షెల్ కంపెనీల్లో Cid అధికారులు సోదాలు నిర్వహించారు. Chandrababu Naidu ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో Skill development corporationలో సుమారు రూ. 242 కోట్ల అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏపీ సీఐడీ అధికారులు  గుర్తించారు. ఈ మేరకు  26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

also read:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం: సీఐడీ దూకుడు.. నలుగురి అరెస్ట్, వేర్వేరు ప్రాంతాల్లో గుట్టుగా విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

ముంబై, పుణెకు చెందిన షెల్ కంపెనీలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా  సీఐడీ గుర్తించారు.  ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండాను ఇచ్చినట్టుగా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించారని కూడా సీఐడీ అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా పుణే కేంద్రంగా సీఐడీ అధికారులు సోదాలు చేశారుత. ఇవాళ పుణెలో ముగ్గురు అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో  ఏ6 గా ఉన్న సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఏ8 గా వికాస్ కన్విల్కర్, ఏ10 గా ముకుల్ అగర్వాల్  పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.  వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురు నిందితులకు 12రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ కేసు విచారణను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ స్కామ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా సమాచారం. ఈ విషయమై ఆధారాలను సేకరించే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులున్నారని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం ఏమిటీ?

రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు ‘సీమెన్స్‌’ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టును సీమెన్స్‌ కంపెనీ తొలుత గుజరాత్‌లో అమలు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా ఆ సంస్థను ఆహ్వానించింది. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్నాయి.  నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పారు. దానికింద ఐదు టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు నెలకొల్పారు. ఇలా ఒక సెంటర్‌, దాని పరిధిలో ఐదు టీఎస్డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం అంటే రూ.491కోట్లు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా భరించినవే. కేవలం 10శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 

click me!