మళ్లీ నోరు జారిన జేసీ, రోషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ చురకలు

Published : Sep 22, 2018, 04:55 PM ISTUpdated : Sep 22, 2018, 05:00 PM IST
మళ్లీ నోరు జారిన జేసీ, రోషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ చురకలు

సారాంశం

వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ప్రబోధానంద స్వామి, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. పౌరుషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు: వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ప్రబోధానంద స్వామి, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. పౌరుషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లాలో అవుకు వద్ద ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. కదిరి సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యల గురించి చర్చించారు. సీఐ మాధవ్ వ్యాఖ్యలు తనని మాత్రమే ఉద్దేశించినవి కాదని  ఎంపీలు, ఎమ్మెల్యేలందరిని ఉద్దేశించే వ్యాఖ్యానించాడని తెలిపారు. ఎమ్మెల్యేలు స్పందించకపోవడంతో  రోషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారని జేసీ చురకలంటించి వెళ్లిపోయారు.

ఈ వార్తలు కూడా చదవండి

మీసం తిప్పితే హీరోవా, చూసుకొందాం,రా...:సీఐపై జేసీ

సీఐ మాధవ్ పై ఫిర్యాదు చేసిన ఎంపీ జేసీ

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్