జగన్ కు పదవీ కాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు పట్టదు: దేవినేని ఉమ

Published : Sep 22, 2018, 03:22 PM IST
జగన్ కు పదవీ కాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు పట్టదు: దేవినేని ఉమ

సారాంశం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ కు పదవీకాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు పట్టడం లేదని విమర్శించారు.

కర్నూలు‌: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ కు పదవీకాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు పట్టడం లేదని విమర్శించారు. గతంలో కుప్పం అభివృద్ధిని రాజశేఖర్ రెడ్డి అడ్డుకుంటే...తమ ప్రభుత్వం మాత్రం పులివెందులకు నీరిచ్చి రైతులను ఆదుకుందని స్పష్టం చేశారు. 

రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలిచారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత ఆనాడు ఎన్టీఆర్‌, నేడు సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. అవుకు సొరంగం ద్వారా కడప జిల్లాకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నీరందిస్తున్నామన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu