బీజేపీ నేతలపై మండిపడ్డ అనురాధ

Published : Sep 22, 2018, 03:56 PM IST
బీజేపీ నేతలపై మండిపడ్డ అనురాధ

సారాంశం

సీఎంపై బీజేపీ, వైసీపీ, పవన్‌ వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని అనురాధ ఆరోపించారు.

బీజేపీ నేతలపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీ, వైసీపీలకు కోవర్టులాగా పనిచేస్తున్నారని విమర్శించారు.

రాంమాధవ్‌ కాకినాడలో అన్ని అబద్ధాలే మాట్లాడారని చెప్పారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రాంమాధవ్‌కు లేదని ఆమె పేర్కొన్నారు. సీఎంపై బీజేపీ, వైసీపీ, పవన్‌ వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని అనురాధ ఆరోపించారు.
 
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కన్నా పార్టీలు మారే ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యానించారు. నూజివీడులో దేవాలయాల భూములు బీనామీల పేరుతో అనుభవిస్తోంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రఫెల్ కుంభకోణంపై జీవీఎల్, హరిబాబు, కన్నా ఎందుకు మాట్లాడడం లేదు? అని బచ్చుల అర్జునుడు నిలదీశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu