Modi Amaravati Visit: రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? మోదీ ఆశ్చర్యపోయేలా!

Published : Apr 24, 2025, 02:04 PM IST
Modi Amaravati Visit: రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? మోదీ ఆశ్చర్యపోయేలా!

సారాంశం

Modi Amaravati Visit: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభం కాగా.. మరికొన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే.. అమరావతి రాజధాని ప్రతిపాదన 2014లోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాదాపు పదేళ్లపాటు అసలు అమరావతి అభివృద్ది కోసం ఎంత నిధులు కేటాయించారు. ఏ ఏ పనులు చేపట్టారు అనేది తెలుసుకుందాం.   

ప్రధాని మోదీ మే 2వ తేదీ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి వస్తున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. మరోవైపు మోదీ పర్యటన ఏర్పాట్లలో అధికారులు బిజీ అయ్యారు. ప్రధాని వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 6 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. మూడు సభ వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేదికపై ప్రధాని మోదీ, సీఎం పవన, డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ నేతలు కూర్చోనున్నారు. మరో వేదికపై మంత్రులు, మూడో వేదికపై రాజధాని అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు కూర్చోనున్నారు. 

ప్రధాని మోదీ పర్యటను ఏర్పాట్లను మంత్రి నారాయణ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. పీఎం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే మార్గాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఏపీ సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ నుంచి ప్రధాని ర్యాలీగా బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు. అయితే.. ఆ ర్యాలీలో మోదీతోపాటు చంద్రబాబు, పవన్‌ పాల్గొనే అవకాశం ఉంది. ఇక ప్రధానికి రాజధాని ప్రాంత రైతులు దారిపొడవునా పూలతో ఘన స్వాగతం పలకనున్నారు. 

ఈ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మే 2 తేదీన రాజధాని పనుల పునః ప్రారంబోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు అమరావతిలో రూ.5 వేల కోట్ల పనులు చేశామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాటు అమరావతి పనులు నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల టెండర్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. ఇప్పటికే రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ తెలిపారు. టెండర్లు దగ్గించుకున్న సంస్థలకు పనులు అప్పగించామని, ప్రధాని చేతుల మీదుగా ఆ పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. 

గడిచిన అయిదేళ్ల కాలంలో రాజధానిలో పనులు నిలిచిపోవడంతో.. నిర్మాణ సామాగ్రి స్టీల్, ఇతర వస్తువుల ధరలు పెరగడం వలనే నిర్మాణ వ్యయం పెరిగిందని మంత్రి నారాయణ అన్నారు. 

PREV
Read more Articles on
click me!