AP 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు ఈసారి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓ విద్యార్థికి 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. మరోచోట ఓ విద్యార్థినికి ఒక్క మార్కు కూడా తగ్గకుండా.. 600కి 600 మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు చూసిన తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది.
ఇక ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతంతో పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 84.09 శాతం, అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది ఫలితాల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పాఠశాలల్లో మాత్రం ఒక్కరు కూడా పాస్ కాలేదు.
ఈ ఫలితాలు అలా ఉంచితే.. కాకినాడ జిల్లాకు చెందిన నేహాంజని అనే విద్యార్థినికి 600 మార్కులకు గాను 600 మార్కులు వచ్చాయి. మరోచోట ఓ విద్యార్థికి సైన్స్ సబ్జెక్టులో కేవలం ఒక్క మార్కు రాగా.. మిగిలిన సబ్జెక్టుల్లో అన్నీ సున్నాలు వచ్చాయి. దీంతో 600కి కేవలం 1 మార్కు తెచ్చుకున్నాడు. దీని చూసిన నెటిజన్లు దయదలిచి ఆ ఒక్క మార్కు వేసుంటారు.. సున్నాలు వేస్తా బాగుండని కామెంట్లు చేస్తున్నారు.
పదో తరగతితో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నటల్లు మంత్రి లోకేష్ తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు ఈ నెల 24 నుంచి 30 వ తేదీ వరకు అదనపు రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లించుకోవచ్చని తెలిపారు. అదనపు రుసుము రూ.50తో.. మే 18వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.