AP 10th Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14% నమోదైంది.
ఇక ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతంతో పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 84.09 శాతం, అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.
పదో తరగతి ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ఈమేరకు ఫలితాల వివరాలను అందులో పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. , ఫెయిలైన విద్యార్థులు నిరుత్సాహ పడవద్దని సూచించారు. మరో అవకాశం ఉందని అన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు తేదీలు ఇలా.. ..
పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నటల్లు మంత్రి లోకేష్ తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు ఈ నెల 24 నుంచి 30 వ తేదీ వరకు అదనపు రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లించుకోవచ్చని తెలిపారు. అదనపు రుసుము రూ.50తో.. మే 18వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
పదో తరగతి, ఒపెన్ స్కూల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విద్యార్థులు సులువుగా వాట్సప్‌లో 9552300009 అనే నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని సందేశం పంపాలి. ఆ తర్వాత పదో తరగతి ఫలితాలను ఎంపిక చేసుకుని అక్కడ రోల్ నంబర్, డేటాఫ్ బర్త్ నమోదు చేస్తే క్షణాల్లో పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఇటీవల లీప్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకుంది. దీని ద్వారా ఉపాద్యాయులు, ప్రధనోపాధ్యాయులు వారి పాఠశాలల్లోని విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. ఇక ఇదే యాప్‌లో తల్లిదండ్రులు కూడా లాగిన్ అయి.. వారి పిల్లల ఫలితాలను చూసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్‌లో కూడా మార్కులు చూసుకునే వెసులుబాటు అధికారులు కల్పించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చు.