ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. 14 స్థానాలకు షెడ్యూల్ విడుదల..

Published : Feb 10, 2023, 11:12 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. 14  స్థానాలకు షెడ్యూల్ విడుదల..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని 14 ఎమ్మెల్సీ స్తానాలకు ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలయ్యింది. వెంటనే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏపీలో 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కలిపి మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ స్థానాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇక ఫిబ్రవరి 23వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఇదే చివరి తేదీ. ఆ తర్వాతి రోజు అప్పటి వరకు వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. 

ఫిబ్రవరి 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు చివరి తేదీగా ఇచ్చారు. ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైతే మార్చి 13 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ప్రకటిస్తారు. గురువారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల కోడ్ ఈ నియోజకవర్గాల్లో.. వెంటనే అమలులోకి వచ్చిందని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణలో కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ షెడ్యూల్ తోనే ఎన్నికలు జరగనున్నాయి. 

మంత్రి ఉషశ్రీ బహిరంగ చర్చకు రావాలని టీడీపీ సవాలు.. కళ్యాణదుర్గంలో భారీగా పోలీసులు మోహరింపు..

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నవారు పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు చేయనున్నారు. ఏఏ స్థానాలకు, ఎక్కడెక్కడ ఉన్న ఎమ్మెల్సీలు పదవీ విరణం చేయనున్నారంటే.. స్థానిక సంస్థల కోటాలో టీడీపీకి చెందిన నెల్లూరు-అనంతపురం ఎమ్మెల్సీ గునపాటి దీపక్ రెడ్డి, కడపకు చెందిన బీటెక్ రవిల పదవీ కాలం మార్చ్ 29న ముగియనుంది. ఇక నెల్లూరుకు చెందినప్రస్తుతం బిజెపిలో ఉన్న  వాకాటి నారాయణరెడ్డి, టీడీపీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్సీలు.. పశ్చిమగోదావరి.. అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పుగోదావరి- చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం-శత్రు చర్ల విజయరామరాజు,  చిత్తూరు బిఎస్ రాజసింహులు, కర్నూలు కే ఈ ప్రభాకర్ లు . వీరంతా మే ఒకటి నా పదవీ విరమణ చేయనున్నారు.

పిడిఎఫ్ కి చెందిన ప్రకాశం -నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, వైసిపికి చెందిన కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,  బిజెపికి చెందిన ఎమ్మెల్సీ శ్రీకాకుళం-విజయనగరం -విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్, కడప- అనంతపురం - కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిలు మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం