కళ్యాణదుర్గం‌లో తీవ్ర ఉద్రిక్తత: టీజంక్షన్ వద్దకు చేరుకున్న టీడీపీ నేత మారుతి, అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 10, 2023, 11:11 AM IST

మంత్రి ఉషశ్రీ చరణ్ పై ఆరోపణలు  చేసిన టీడీపీ నేత మారుతి టీ జంక్షన్ వద్దకు  చేరుకున్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ సమయంలో  ఉద్రిక్తత చోటు  చేసుకుంది. 
 


అనంతపురం:   ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో  గురువారం నాడు ఉద్రిక్తతలు చోటు  చేసుకున్నాయి.   పోలీసుల కళ్లుగప్పి  టీడీపీ నేత మారుతి   టీ జంక్షన్ కు  చేరుకున్నారు.   పోలీసులతో   మారతి వాగ్వాదానికి దిగారు  టీడీపీ కార్యకర్తలు కూడా  టీ జంక్షన్ వద్దకు  చేరుకున్నారు. పోలీసులకు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట  చోటు  చేసుకుంది.   టీడీపీ నేత మారుతితో పాటు  టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మంత్రి ఉషశ్రీ చరణ్  అక్రమాలకు  పాల్పడ్డారని  టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు.  ఉషశ్రీ అక్రమాలకు  సంబంధించి   ఆధారాలను బయటపెడతానని టీడీపీ  నేతలు  ప్రకటించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని  టీ జంక్షన్  వద్ద చర్చకు  రావాలని   టీడీపీ నేతలు మారుతి  సవాల్ విసిరారు. టీడీపీ, వైసీపీ  మధ్య  సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు  చేసుకున్నాయి. దీంతో   టీడీపీ నేతలను  పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు  చేశారు.  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  హనుమంతరాయచౌదరిని  హౌస్ అరెస్ట్ చేశారు.  పోలీసుల కళ్లుగప్పి  తప్పించుకొని తిరుగుతున్న మారుతి ఇవాళ  ఉదయం టీ జంక్షన్ కు  చేరుకున్నారు. మారుతి టీ జంక్షన్ వద్దకు  చేరుకోగానే పోలీసులు అతనిని అరెస్ట్  చేశారు.  ఈ సమయంలో  టీడీపీ శ్రేణులు అడ్డుకొనే  ప్రయత్నం  చేశారు.  పోలీసులకు , టీడీపీ శ్రేణుల మధ్య  తోపులాట, వాగ్వాదం చోటు  చేసుకొంది. దీంతో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   చివరికి మారుతిని  పోలీసులు  అరెస్ట్  చేసి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో  పలు గ్రామాల్లో  టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.

Latest Videos

 

click me!