ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటలో జ్యోత్స్న అనే మహిళను భర్త నాగుల్ మీరా హత్య చేశాడు.
ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటలో జ్యోత్స్న అనే మహిళను భర్త నాగుల్ మీరా హత్య చేశారు. నాగుల్ మీరా, జ్యోత్స్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గురువారం నాడు రాత్రి జ్యోత్స్నను నాగుల్ మీరా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగా ఆవేశం పట్టలేక నాగుల్ మీరా భార్య జ్యోత్స్నపై కత్తితో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని జ్యోత్స్న కొడుకులు షేక్ వాజిబ్, షేక్ వసీం లు సమీపంలోని తన మేనమామ కు సమాచారం ఇచ్చారు.. అతను వచ్చి చూసేసరికి జ్యోత్స్న మృతి చెందింది. జ్యోత్న్స మృతి చెందిన విషయాన్ని గుర్తించిన నాగుల్ మీరా పారిపోయాడు.
undefined
జ్యోత్స్న, నాగుల్ మీరాలు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కట్నం కోసం ఆమెను వేధింపులకు గురిచేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం వేధింపులు ఎక్కువ కావడంతో జ్యోత్స్న పుట్టింటికి వెళ్లింది. దీంతో నాగుల్ మీరా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యను వేధింపులకు గురిచేశాడు. సోషల్ మీడియాలో ఆమెపై అభ్యంతరకర పోస్టులు కూడా పెట్టేవాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత ఏడాది అక్టోబర్ మాసంలో బాధితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. . దీంతో నాగుల్ మీరా తన స్వగ్రామమైన తిరువూరుకు వెళ్లిపోయాడు. నిన్న రాత్రి జ్యోత్స్న వద్దకు వచ్చిన నాగుల్ మీరా ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థలాన్ని నూజీవీడు డీఎస్పీ పరిశీలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదే జిల్లాలో ఇటీవలనే తల్లీకూతురు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో మరియమ్మను ఆమె కూతురు ఈ నెల 4వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. మరియమ్మతో సహజీవనం చేసిన రవీందర్ అతని స్నేహితుడు చందులు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.