
అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneswari ) పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మంగళవారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో భువనేశ్వరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించినా వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారని ఒద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు .. ఆడవాళ్లను ఎలా ట్రీట్ చేశాడో అందరికీ తెలుసునని అన్నారు.
అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులపై మాట్లాడటమేమింటని ప్రశ్నించారు. అందుకే ఆడవాళ్లను హేళన చేశాడు కాబట్టే.. చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడ లేదేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడుతుంటే అది మీ భ్రమే అవుతుందని హితవు పలికారు. చంద్రబాబు హయంలో ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన రోజు కనిపించని భువనేశ్వరి ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు.
Read Also : ఆదిలోనే అడ్డంకులు.. తట్టుకుని నిలిచిన శివానీ రాజశేఖర్.. నెల గ్యాప్‌లో రెండు సినిమాలు
చంద్రబాబు దొంగ ఏడ్పులు ఏడిస్తే.. ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే... చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. తన స్వార్థం కోసం తమ మామకే వెన్నుపోటు పోడిచిన వ్యక్తి అని, తాజాగా మరోసారి తన రాజకీయం కోసం.. భార్యను కూడా రోడ్డుకు ఎక్కించాడని చంద్రబాబును విమర్శించింది. బాబు వల్లే భువనేశ్వరికే ప్రమాదం పొంచి ఉంది.. భువనేశ్వరే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో ఎన్టీఆర్‌ను ఏడిపించారు.. నన్ను కూడా ఏడిపించారని రోజా అన్నది. చంద్రబాబు పాలనలో కాల్‌మనీ వ్యవహరంలో గానీ, గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయారు ఈ విషయంలో మాట్లాడని భువనేశ్వరి ఇప్పుడు ఎందుకు నోరు తెరిసింది. ఇకనైనా చంద్రబాబుతో కేర్ ఫుల్ గా ఉండాలని నగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సూచించారు.
Read Also : నేనేప్పుడూ మంత్రికి విధేయుడినే: బాలినేని ఇంట్లో సుబ్బారావు ప్రత్యక్షం
నారా భువనేశ్వరి ఏం మాట్లాడరంటే.. !
తిరుపతిలోని ట్రస్టు కార్యాలయంలో సోమవారం నాడు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై రియాక్ట్ అయ్యారు నారా భువనేశ్వరి. తనను అసెంబ్లీలో అవమానించినోళ్లు వారి పాపాన వాళ్లే పోతారని అన్నారు. తన గురించి అలా మాట్లాడితే.. చాలా మనోవేదన అనుభవించానని, మామూలు మనిషిని కావడానికి దాదాపు పది రోజులు పట్టిందని అన్నారు. వాళ్లు వచ్చి సారీ చెబుతారని ఎదురుచూడటం లేదని, దానికోసం టైమ్ వేస్ట్ చేసుకోనని అన్నారు నారా భువనేశ్వరి. మహిళల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. హెరిటేజ్ కంపెనీని కూలగొట్టాలని చాలా మంది చూశారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భువనేశ్వరి. హెరిటేజ్ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, హెరిటేజ్‌ను ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు నారా భువనేశ్వరి.