వలస కార్మి కులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులు బాటును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధితో అమలుచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని చెప్పారు.
వలస కార్మి కులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులు బాటును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధితో అమలుచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసి వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను రైల్వే శాఖకు చెల్లించినట్టు తెలిపారు.
undefined
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయడానికి, ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున దశలవారిగా వలస కార్మికులను పంపు తున్నట్టు మంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రకారం తమ వంతు వచ్చేవరకు ఓపికతో వేచి ఉండాలని, రైలు దొరకదనే ఆందోళన వద్దని నాని సూచించారు.
Also Read:కేజీహెచ్ వద్ద ఎల్జీ పాలీమర్స్ బాధితుల ధర్నా
ఈ నెలాఖరు వరకు అన్ని రాష్ట్రా లకు ఆంధ్రప్రదేశ్ నుండి వలస కార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని రకా లుగా అండగా నిలుస్తుందని తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి క్వారంటైన్ తప్పనిసరని, ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు నాని చెప్పారు.
భౌతిక దూరం అమలు చేయాల్సి ఉన్నందున ప్రతి రైలులో 1200 మంది చొప్పున ప్రతిరోజు 6వేమంది వలసకార్మికులను వారి వారి ప్రాంతాలకు పంపుతున్నామన్నారు. తమ సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వలస కార్మికులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్నినాని సూచించారు.
లక్నో, పాట్నా, జైపూర్, భోపాల్, కోల్‌కత, భువనేశ్వర్ తదితర నగరాలకు విజయవాడ నుంచి రైళ్లు నడుపుతున్నామన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, తమ సొంత ఊర్లలో ఉన్న పరిస్థితుల గురించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలసకార్మికులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి ముందస్తుగా తెలుసుకోవాలని మంత్రి సూచించారు.
Also Read:ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు: వైసీపీ ఆరోపణలపై బాబు సవాల్ ఇదీ...
కాగా కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇద్దరు వార్డు వాలంటీర్లు తమవంతు సహాయం అందించారు.
మచిలీపట్నం 17 వ డివిజన్ సర్కిల్ పేట 1 వ సచివాలయంకు చెందిన వార్డు వాలింటీర్లు భూపతి కావ్య , భూపతి సాయినాధ్‌లు సోదరీ సోదరమణులు తమ జీతంలో సగం మొత్తం 5 వేల రూపాయలను మంత్రి పేర్ని నానికి అందజేశారు.