జగన్ పై దాడి.. స్పందించిన మంత్రి లోకేష్

By ramya neerukondaFirst Published Oct 25, 2018, 2:44 PM IST
Highlights

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు

వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలకు నేటి సమాజంలో చోటు లేదంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

 

Strongly condemn the attack on Opposition Leader garu that happened at Vizag airport. Such cowardly attacks have no place in the modern society.

— Lokesh Nara (@naralokesh)

గురువారం విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో కూర్చొని ఉండగా దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

read more news

హైదరాబాద్ చేరుకున్న జగన్.. ఎయిర్ పోర్ట్ కి అభిమానులు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

click me!