మీకు అడుగు దిగుద్ది: ఆ పత్రికలంటూ నాని వార్నింగ్

Siva Kodati |  
Published : Jan 05, 2021, 09:37 PM IST
మీకు అడుగు దిగుద్ది: ఆ పత్రికలంటూ నాని వార్నింగ్

సారాంశం

సీఎం జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. మంగళవారం నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు 

సీఎం జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. మంగళవారం నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .

ఈ సందర్భంగా తనపై కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెల్స్‌పై ఆయన మండిపడ్డారు. మీ ఛానల్స్ , పత్రికల్లో నా ఫొటో తప్ప ఎవరి ఫొటోలు పెట్టుకోకున్నా అభ్యంతరం లేదన్నారు .

మీ ఛానల్స్ ఎంత , మీ బతుకులెంత అంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు . అవి టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అంటూ ఎద్దేవా చేశారు . జగన్మోహనరెడ్డికి రాజకీయంగా అంగుళం హాని తలపెడితే మీకు అడుగు దిగుద్దని నాని హెచ్చరించారు .

Also Read:పేకాటలో నా అనుచరులుంటే ఏమైంది... ఉరిశిక్ష వేస్తారా?: మంత్రి కొడాలి నాని

మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని ఆయన సూచించారు. సీఎం జగన్మోహనరెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారని నాని ఎద్దేవా చేశారు.

తనలాంటి వారు జగన్ వెనుక ఉంటూ చంద్రబాబును , ఆయన పార్టనర్‌ను , లోకేష్‌ను విమర్శిస్తే బూతుల మంత్రనో , భూషణం మంత్రనో అంటున్నారని , మీ ఇష్టమొచ్చినట్టుగా హెడ్డింగ్లు పెట్టుకున్నా లెక్కచేసేది లేదన్నారు.

సీఎం జగన్‌ని ఒక మాట అంటే అన్నవారిని తిరిగి పది మాటలు అంటామని నాని హెచ్చరించారు . జగన్ వెనుక ఉన్నానన్న ఆక్రోశంతో ఏబీఎన్ రాధాకృష్ణ , టీవీ 5 బీఆర్ నాయుడు , ఈనాడు రామోజీరావులు వారి ఛానల్స్‌లో ఇష్టమొచ్చినన్ని రోజులు తన గురించి వేసుకోవచ్చని , పత్రికల్లో రాసుకోవచ్చని , ఐ డోంట్ కేర్ అంటూ ఆయన తేల్చి చెప్పేశారు.

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!