చిత్తూరులో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం: ఏపీలో 8,83,587కి చేరిన కేసులు

By Siva Kodati  |  First Published Jan 5, 2021, 9:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. కోవిడ్ టెస్టులు భారీగా పెంచడంతో, కేసుల్లో పెరుగుదల నమోదైంది. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 377 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,83,587కి చేరింది. కరోనా బారిన పడి నిన్న నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 7,122కు చేరింది. 

Latest Videos

undefined

నిన్న 278 మంది కోవిడ్‌ 19 నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,73,427కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,038కి చేరుకుంది.

నిన్న చేసిన వాటితో కలిపి ఇప్పటి వరకు పరీక్షల సంఖ్య 1,20,53,914 చేరింది. గత 24 గంటలలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 82 కరోనా కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి.

ఇక అనంతపురం 11, తూర్పుగోదావరి 21, గుంటూరు 60, కడప 21, కృష్ణ 66, నెల్లూరు 17, ప్రకాశం 6, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 41, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 27 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. 

: 05/01/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,80,692 పాజిటివ్ కేసు లకు గాను
*8,70,532 మంది డిశ్చార్జ్ కాగా
*7,122 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,038 pic.twitter.com/xIHskfCj9E

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!