పక్కా ప్రణాళికతోనే రామతీర్ధం ఘటన: ఏపీ సీఐడీ చీఫ్

Siva Kodati |  
Published : Jan 05, 2021, 07:20 PM ISTUpdated : Jan 05, 2021, 08:32 PM IST
పక్కా ప్రణాళికతోనే రామతీర్ధం ఘటన: ఏపీ సీఐడీ చీఫ్

సారాంశం

రామతీర్ధం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కోదండరామస్వామి విగ్రహాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పరిశీలించారు. 

రామతీర్ధం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కోదండరామస్వామి విగ్రహాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రామతీర్ధంలో రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని సునీల్ తెలిపారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘటనా స్థలంలో హెక్సా బ్లేడ్ లభ్యమైందని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం, వివాదాలు సృష్టించడమే ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సునీల్ అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని.. దోషులను వెంటనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:ఏపీలో ఆలయాలపై దాడులు: చినజీయర్ ఆగ్రహం.. విచారణకు డిమాండ్
 
కాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి కారణమైన రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం దేవాదాయ, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.  

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే