ఎంపీ టిక్కెట్టు జేబులో ఉంది,కానీ..: గుమ్మనూరు జయరాం

Published : Jan 12, 2024, 03:54 PM IST
ఎంపీ టిక్కెట్టు జేబులో ఉంది,కానీ..: గుమ్మనూరు జయరాం

సారాంశం

కర్నూల్ ఎంపీ టికెట్టు దక్కినా కూడ  పోటీ విషయంలో కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటానని గుమ్మనూరు జయరాం చెబుతున్నారు.

కర్నూల్:కార్యకర్తల నిర్ణయం మేరకు  నడుచుకుంటానని మంత్రి గుమ్మనూరు జయరాం  చెప్పారు.శుక్రవారం నాడు  మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆలూరులోనే  పోటీ చేయాలని ఆయన అనుచరులు నినాదాలు చేశారు.   కర్నూల్ ఎంపీగా పోటీ చేయవద్దని కోరారు. ఈ విషయమై  అవసరమైత తాడేపల్లికి వెళ్లి తమ అభిప్రాయాన్ని సీఎం జగన్ కు చెప్పాలని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా  కార్యకర్తలతో  మంత్రి జయరాం మాట్లాడారు.

also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....

కర్నూల్ ఎంపీ టిక్కెట్టు  తన జేబులో పెట్టుకొని వచ్చినట్టుగా చెప్పారు.  ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు.  నామినేషన్ సమయంలో  కూడ బీ ఫారాలు మారిన సందర్భాలున్న విషయాన్ని గుమ్మనూరు జయరాం గుర్తు చేశారు.15 ఏళ్లుగా  ఆలూరు ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు.ఆలూరు వైసీపీ కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆయన  స్పష్టం చేశారు.

also read:ఒంగోలు ఎంపీ సీటుపై సస్పెన్స్:మాగుంటకు మరోసారి లక్కు దక్కేనా?

ఆలూరు అసెంబ్లీ టిక్కెట్టును గుమ్మనూరు జయరాంకు  ఇచ్చేందుకు  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నిరాకరించింది. ఈ స్థానంలో  విరూపాక్షికి టిక్కెట్టు కేటాయించింది.  కర్నూల్ ఎంపీ టిక్కెట్టును  గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. 

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

కర్నూల్ ఎంపీగా పోటీ చేయడానికి  గుమ్మనూరు జయరాం  సానుకూలంగా లేరు.  ఆలూరు నుండే పోటీ చేసేందుకు  మొగ్గు చూపారు. అయితే  కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని జగన్ జయరాంను ఆదేశించారు. అయిష్టంగానే జయరాం  కర్నూల్ ఎంపీగా పోటీ చేసేందుకు సానుకూలంగా స్పందించారని  సమాచారం. కర్నూల్ ఎంపీ స్థానం గుమ్మనూరు జయరాంకు కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో  సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం