కొణతాలకు బంపర్ ఆఫర్

Published : May 26, 2017, 07:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కొణతాలకు బంపర్ ఆఫర్

సారాంశం

కొణతాల టిడిపిలో చేరటం చంద్రబాబునాయుడుకు కూడా ఇష్టమేనంటూ ఓ ప్రకటన కూడా చేసారు. పైగా కొణతాలను పార్టీలోకి చేర్చుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లు కూడా మంత్రి చెప్పారు.

కొణతాలరామకృష్ణకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మహానాడులో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామంటూ మంత్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే షరతులు వర్తించబడును అన్నట్లు ‘ణతాల టిడిపిలో చేరితేనే’ అని కూడా అన్నారు. తనకు అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రపై మాట్లాడుతానంటూ కొణతాల ఇటీవలే ఓ ప్రకటన చేసారులేండి. దానిపైనే చింతకాయల స్పందించారు. టిడిపి జరుపుకునే మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇస్తారని  సీనియర్ లీడరైన కొణతాల ఎలా అనుకున్నారో?

ఆ విషయంపైనే చింతకాలయ మాట్లాడుతూ, కొణతాల టిడిపిలో చేరటం చంద్రబాబునాయుడుకు కూడా ఇష్టమేనంటూ ఓ ప్రకటన కూడా చేసారు. పైగా కొణతాలను పార్టీలోకి చేర్చుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లు కూడా మంత్రి చెప్పారు. రాజకీయ మేధావిగా కొణతాల ఎటువంటి సలహాలిచ్చినా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చింతకాయల హామీ కూడా ఇచ్చారు. ఇంకేముంది కొణతాల కూడా ఎటుతిరిగీ ఖాళీగానే ఉన్నారు కాబట్టి టిడిపిలో చేరిపోతే పోలా?

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?
CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu