ప్రధాని పరిశీలనలో ఎన్టీఆర్ కు ‘భారత రత్న’ డిమాండ్

First Published May 26, 2017, 5:35 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న అభ్యర్థన  మీద కేంద్రం  స్పందించింది. దీనిపై తెలుగుదేశం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడి అభ్యర్థనను ప్రధాని కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందించారు.

 తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న అభ్యర్థన  మీద కేంద్రం  స్పందించింది.  ఈ విషయం మీద తెలుగుదేశం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడి అభ్యర్థనను ప్రధాని కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందించారు.

 

ఎన్టీఆర్ కు *భారత రత్న* తెచ్చుకోవాలన్న తపన తెలుగుదేశం పార్టీలో ఎపుడూ పెద్దగా లేదు. ఇన్ని ప్రాజక్టులు తెచ్చుకుంటున్నపుడు పైసా ఖర్చుకాని భారత రత్న తెచ్చుకోవడం కోసం  ప్రయత్నం పెద్దగా జరిగినట్లు కనిపించదు. ఎపుడో ఇలా ఉత్తరాలు, అభ్యర్థనలు తప్ప. గతంలో కింజారపు ఎర్రన్నాయుడు ఇలా ఉత్తరాలు రాస్తూ వచ్చారు.  ఇపుడు ఆయనకుమారుడు రామ్మోహన్ చేశాడు.

 

ఎన్‌టిఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు గతంలో రాసిన కేంద్రానికి లేఖరాశారు. దానికి ఇపుడు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. భారత రత్న ఎవరికి ఇవ్వాలో ప్రధాని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని రిజిజు తెలిపారు. రామ్మోహన్‌నాయుడు రాసిన లేఖను పిఎంవోకు పంపించామని ఆయన చెప్పారు. పిఎంవో ఆ లేఖను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని రిజిజు వెల్లడించారు.

click me!