టీడీపీ ఆఫీసులో వ్యూహాం... కౌన్సిల్‌లో అమలు: మండలి పరిణామాలపై బొత్స సీరియస్

By Siva KodatiFirst Published Jun 18, 2020, 4:50 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను అడ్డుకోవాలని ముందుగానే ఆఫీసులోనే వ్యూహాలు రచించుకుని కౌన్సిల్‌కు వచ్చారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ

తెలుగుదేశం పార్టీ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను అడ్డుకోవాలని ముందుగానే ఆఫీసులోనే వ్యూహాలు రచించుకుని కౌన్సిల్‌కు వచ్చారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వపరమైన బిల్లులు, కార్యక్రమాలకు ప్రతిపక్షం ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుతగులుతోందని మంత్రి ఆరోపించారు.

Also Read:మంత్రుల దాడులు తట్టుకొని పోరాటం: ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

టీడీపీకి కొన్ని బిల్లుల పట్ల అభ్యంతరాలున్నాయని వాటిపపై ఓటింగ్ జరుపుకోవచ్చునని.. డివిజన్‌లో వాటిని ఓడించుకోవచ్చునని బొత్స సూచించారు. కానీ సంఖ్యాబలం చూసుకుని బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం ఎమ్మెల్సీలు అధికార పార్టీ సభ్యుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఇదే సమయంలో మా సభ్యులు అంటూ డిప్యూటీ ఛైర్మన్ మాట్లాడారని బొత్స ఆరోపించారు.

రూల్ . 90 అనేది ముందు రోజు నోటీసు ఇవ్వాలని.. హౌస్‌లో ఉన్న సభా నాయకుడితో చర్చ జరపాలి. యనమల రామకృష్ణుడు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చూసినట్లుగా అలా కాదు.. ఇలా అంటూ చెప్పారని మంత్రి గుర్తుచేశారు.

Also Read:లోకేష్ ప్రోత్సాహంతోనే మాపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి యత్నం: మంత్రి వెల్లంపల్లి

ఏమైనా అంటే  విచక్షణాధికారం అంటున్నారని.. చివరికి మంత్రుల మీద భౌతిక దాడికి దిగారని బొత్స ఆరోపించారు. హౌస్‌లో జరుగుతున్న వ్యవహారాలను వీడియో తీయడం తప్పని గత సమావేశాల సందర్భంగా లోకేశ్‌కు చెప్పామని.. కానీ నిన్న కూడా ఇదేరకంగా వ్యవహరించారని మంత్రి ఎద్దేవా చేశారు.

బుధవారం శాసనమండలిలో జరిగిన సంఘటనను ఖండించిన ఆయన.. ప్రతిపక్షం ఎన్ని కుట్రలను చేసినా, రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 
 

click me!