ఈఎస్ఐ స్కాంలో 8 మంది సచివాలయ ఉద్యోగుల పాత్ర: ఏసీబీ గాలింపు

Published : Jun 18, 2020, 03:46 PM ISTUpdated : Jun 18, 2020, 04:00 PM IST
ఈఎస్ఐ స్కాంలో 8 మంది సచివాలయ ఉద్యోగుల పాత్ర: ఏసీబీ గాలింపు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కాంలో ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టుగా  ఏసీబీ గుర్తించింది.ఈ కేసుల్లో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు‌తో పాటు ఏడుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కాంలో ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టుగా  ఏసీబీ గుర్తించింది.ఈ కేసుల్లో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు‌తో పాటు ఏడుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఎనిమిది మంది కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ 8 మంది అధికారుల ఫోన్ నెంబర్ల ఆధారంగా ఏసీబీ గాలింపులు చేపట్టారు.

వీరి ఫోన్ నెంబర్లు కూడ స్విచ్ఛాప్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాల్‌డేటాతో పాటు ఫోన్ సిగ్నల్స్ ద్వారా వీరిని అదుపులోకి తీసుకొనేందుకు ఏసీబీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

also read:ఆగని రక్తస్రావం... అచ్చెన్నాయుడికి మళ్లీ ఆపరేషన్ తప్పదన్న డాక్టర్లు

ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్రతో పాటు మరో ఆరుగురిని ఈ నెల 12వ తేదీన అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడికి 14 రోజుల  పాటు రిమాండ్ విధించారు. అనారోగ్య సమస్యలతో అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇదే కేసులో మరికొందరి పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు.ఈ కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానం ఉన్న 8 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో ఏసీబీ అధికారులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu