
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్ లాంటిదని రాంబాబు వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి వస్తారని తాము ముందే చెప్పామని అంబటి రాంబాబు చురకలంటించారు. వారి చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని.. తెలుగుదేశం పరిరక్షణ కోసమేనని మంత్రి సెటైర్లు చేశారు. టీడీపీ, జనసేన వేర్వేరుగా ఎప్పుడూ లేవన్నారు. మరణాలకు పోలీసులు కుట్ర చేశారంటూ బుద్ధిలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso REad: కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు వైసీపీ కుట్ర: పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత చంద్రబాబు
11 మంది మరణంపై మాట్లాడకపోవడం దారుణమన్న ఆయన.. బీజేపీతో వుంటూ చంద్రబాబుతో కలవడానికి పవన్‌కు సిగ్గులేదా అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుతో కలవడానికి బీజేపీ ఆయనకు రూట్ మ్యాప్ ఇచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. ఎంతమంది వచ్చినా సీఎం జగన్‌ను కదపలేరని రాంబాబు స్పష్టం చేశారు. ఈ పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు కావన్న అంబటి.. టీడీపీని కాపాడేందుకే జనసేన పుట్టిందని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రలజ ప్రాణాల పరిరక్షణ కోసమే జోవో నెంబర్ 1 ని జారీ చేశామని అంబటి తెలిపారు. నిబంధనల ప్రకారం ఎవరైనా సభలు నిర్వహించుకోవచ్చునని మంత్రి చెప్పారు.
వయసు సంబంధిత సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని అంబటి ఆరోపించారు. బాబు, పవన్ కలిసి వస్తే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ ఎంత గగ్గోలు పెట్టినా వైసీపీని ఓడించలేరని అంబటి పేర్కొన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారని.. పార్టీని నడపలేకపోతే జనసేనను పవన్ టీడీపీలో కలిపేయాలని రాంబాబు చురకలంటించారు.పవన్ కల్యాణ్‌ను నమ్మి కాపులు మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబుకు రాజకీయ మరణం తప్ప మరొకటి లేదని అంబటి జోస్యం చెప్పారు. చంద్రబాబును పవన్ కల్యాణ్ కాపాడలేరని.. టీడీపీ పని అయిపోయిందన్నారు.
Also Read: సంక్రాంతి మామూళ్ల కోసం, గంగిరెద్దు మాదిరిగా : చంద్రబాబుతో పవన్ భేటీపై వైసీపీ తీవ్ర విమర్శలు
సంక్రాంతికి అందరి ఇళ్లకు గంగిరెద్దులు వెళ్తాయని.. డూ డూ బసన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు పవన్ కలయికతో ఆశ్చర్యపోవాల్సింది బీజేపీయేనని ఆయన పేర్కొన్నారు. పవన్ సీఎం అవుతాడని నమ్మే అమాయకులు ఈరోజు జరిగింది చూసి ఆశ్చర్యపోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కలిసే ఎన్నికలకు వెళ్తారని మేమెప్పుడో చెప్పామని అంబటి గుర్తుచేశారు. బీజేపీతో పొత్తులో వుండి టీడీపీతో లవ్ ట్రాక్ నడుపుతున్న వ్యక్తి పవన్ అంటూ మంత్రి దుయ్యబట్టారు.